స్మార్ట్‌ఫోన్... అందరి జీవితంలో భాగమైపోయింది. చాలావరకు సేవలు స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందే అవకాశం ఉండటంతో మొబైల్ ఫోన్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు పర్సనల్ డేటా నుంచి బ్యాంకు ఖాతాల వివరాల వరకు అన్నీ అరచేతిలోనే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో రిస్క్‌లు కూడా అన్నే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నారంటే మళ్లీ చేజిక్కించుకోవడం కష్టం. ఫోన్ పోయిందంటే ముఖ్యమైన ఫైల్స్, డేటా కూడా గల్లంతే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. దొరికితే అదృష్టమే అనుకోవాలి. ఫోన్ కొట్టేసినవాళ్లు ఐఎంఈఐ నెంబర్ మార్చి క్లోన్ చేసి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తుంటారు. ఇకపై సెల్‌ఫోన్ చోరీలను, మొబైల్ క్లోనింగ్‌ను అడ్డుకోవడానికి టెలికాం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోబోతోంది. సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్-CEIR ఏర్పాటు చేయబోతోంది. ఇందులో ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీస్-IMEIs ఉంటాయి.
IMEI అంటే ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఉండే యూనిక్ నెంబర్. IMEI ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయడం మాత్రమే కాదు... ఫోన్ చోరీకి గురైనప్పుడు డేటా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏర్పాటైతే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి తర్వాత హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్‌కు కంప్లైంట్ చేయొచ్చు. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ 15 అంకెల IMEI నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. ఇక ఆ ఫోన్‌తో ఏ సెల్యులార్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్, వైట్, గ్రే పేరుతో మూడు కేటగిరీలుగా ఉంటాయి. వైట్ లిస్ట్‌లో ఉన్న ఐఎంఈఐ నెంబర్లతో ఉన్న ఫోన్లను ఎవరైనా వాడుకోవచ్చు, అమ్మొచ్చు, కొనొచ్చు. బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే అవి చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్లు. ఏ సెల్యులర్ నెట్వర్క్ యాక్సెస్ లభించదు. ఇక గ్రే లిస్ట్‌లో ఉంటే వాటిని కొన్ని షరతులతో ఉపయోగించుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్ క్లోనింగ్, మొబైల్ చోరీల సమస్య భారతదేశంలో తీవ్రంగా ఉంది. ఐఎంఈఐ నెంబర్లు మార్చి ఫోన్లు అమ్మడం చీకటి వ్యాపారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ ప్రాజెక్ట్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ 2017 జూలైలో ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణెలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు 2019-20 మధ్యంతర బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించింది కేంద్రం. ట్రాయ్ డేటా ప్రకారం 2019 మార్చి నాటికి భారతదేశంలో 1.16 బిలియన్ వైర్లెస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని అంచనా.
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి