అదృష్టం ఎప్పుడు ఏవైపు నుంచి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ, అది తలుపు తట్టినప్పుడు మాత్రం ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలి. న్యూయర్క్‌లోని జిలియన్ కానన్ అనే మహిళకు కూడా ఇటువంటి అదృష్టమే తలుపు తట్టింది. ఆమె ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండానే అమెజాన్ నుంచి డెలివరీ బాక్స్‌లు ఇంటి ముందు వచ్చి పడ్డాయి. ఒకటి, రెండు కాదు ఇలా ఇప్పటివరకు ఏకంగా 150 డెలివరీ బాక్సులను అందుకుంది. అయితే జూన్ 5 నుంచి వరుసగా వస్తున్న ఈ డెలివరీ బాక్స్‌లను చూసి ఎవరైనా సర్ప్రైజ్ చేయడానికి చేశారా?.. లేదంటే ఇదేమైనా స్కామ్‌లో భాగమా? అని తొలుత ఆలోచించిందట! క్లారిటీ కోసం కస్టమర్ సపోర్ట్‌కు కాల్ చేసి కనుక్కుందట.
‘నేను ఆర్డర్ చేయకుండానే డెలివరీ బాక్సులు వచ్చాయి. వేరే వారికి పంపించబోయి పొరపాటున నా అడ్రస్‌కు పంపించారేమో.. వీటిని రిటర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’.. అని కస్టమర్ సపోర్ట్ టీంతో చెప్పింది. అయితే, అమెజాన్ నుంచి ఆమెకు ఊహించని సమాధానం వచ్చింది. ఈ పార్సిల్స్ మీవేనంటూ.. వీటిని వెనక్కి తీసుకోవడం కుదరదంటూ అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పేశారు. ఊహించని సమాధానంతో ఖంగుతిన్న సదరు మహిళ ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది.
Social Media: ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్స్ ఔట్
Realme X7 Max: రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్
అసలు ఈ డెలివరీ బాక్సుల్లో ఏముందో తెలుసుకోవాలని వాటిని తెరిచి చూడగా.. అందులో, ఫేస్ మాస్క్‌ల తయారీకి ఉపయోగించే సిలికాన్ సంబంధిత ఫ్రేములు కనిపించాయి. వాటిపైన నో రిటర్న్ అని కూడా రాసి ఉంది. ఇవి ఎవరికి చెందినవో తెలుసుకోవడానికి.. బాక్స్‌లపై ఉన్న బార్ కోడ్లు, ట్రాకింగ్ నెంబర్లతో వివరాల గురించి వెతకడం మొదలు పెట్టింది.
ఈ వింత ఘటనపై జిలియన్ కానన్ మాట్లాడుతూ “ఆర్డర్ ఇవ్వకుండానే డెలివరీలు వచ్చిపడుతుండటాన్ని చూసి ముందుగా ఇదేదో స్కాం అనుకున్నా. వారి దగ్గర ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారని భావించా. ఎందుకంటే నాకు వచ్చిన వస్తువులన్నీ ఒకే విధంగా ఉన్నాయి.” అని పేర్కొంది. మరోసారి అమెజాన్‌కు ఫోన్ చేసి ఆర్డర్ల గురించి వివరించింది. దీంతో, ఆమెజాన్ అసలు ఓనర్‌ను ట్రాక్ చేసింది. ఈ బాక్సులు DIY క్రియేటివ్ స్టూడియో ఆర్డర్ చేయగా.. పొరపాటున జిలియన్ కానన్ అడ్రస్ వచ్చాయని తేలింది.
Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా
Google App Crashing: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్ క్రాష్ అవుతోందా... వెంటనే ఇలా చేయండి
స్థానిక చిల్డ్రన్ ఆసుపత్రిలో రోగులకు మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేసేందుకు డీఐవై స్టూడియో వీటిని ఆర్డర్ చేసింది. అయితే వారికి కలిగిన అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకొని.. ఆ సంస్థకు ఉచితంగా డెలివరీ బాక్స్‌లను అందించాలని జిలియన్ అమెజాన్‌ను కోరింది. అమెజాన్ ఆమె విజ్ఞప్తిని అంగీకరించి మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA