హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

AirPods: ఫ్లైట్‌లో ఎయిర్‌పాడ్స్ మర్చిపోయిన మహిళ..12 రోజులకు ఎలా దొరికాయంటే?

AirPods: ఫ్లైట్‌లో ఎయిర్‌పాడ్స్ మర్చిపోయిన మహిళ..12 రోజులకు ఎలా దొరికాయంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన అలీసబెత్ హెడెన్, శాన్ ఫ్రాన్సిస్కోలో విమానాశ్రయంలో తన ఎయిర్‌పాడ్స్‌ పోగొట్టుకుంది. కానీ దాదాపు రెండు వారాల తర్వాత, ఆమె వాటిని తిరిగి సొంతం చేసుకుంది. ట్రాకింగ్‌ ద్వారా వాటిని కనుగొంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

AirPods: ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో(Advanced technology) పోగొట్టుకున్న వస్తువులు కొన్ని తిరిగి దొరుకుతున్నాయి. ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. చాలా సందర్భాల్లో యాపిల్‌ డివైజ్‌లను ట్రాక్ చేయడం ద్వారా దొంగిలించిన బ్యాగ్‌లు, కార్‌లను బాధితులు తిరిగి పొందారు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన అలీసబెత్ హెడెన్, శాన్ ఫ్రాన్సిస్కోలో విమానాశ్రయంలో తన ఎయిర్‌పాడ్స్‌ పోగొట్టుకుంది. కానీ దాదాపు రెండు వారాల తర్వాత, ఆమె వాటిని తిరిగి సొంతం చేసుకుంది. ట్రాకింగ్‌ ద్వారా వాటిని కనుగొంది. ఈ ఘటనకు సంబంధించి CNN రిపోర్ట్‌ తెలిపిన పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

హెడెన్ మిలటరీలో సెకండ్‌మెంట్‌లో ఉన్న తన భర్తను చూడటానికి టోక్యో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో టోక్యో నుంచి తొమ్మిది గంటల ప్రయాణం తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఆమె తన డెనిమ్ జాకెట్‌ని తన సీటు వద్దనే మర్చిపోయింది. ఈ ఘటనపై హెడెన్‌ మాట్లాడుతూ..‘నేను విమానం దిగినప్పుడే జాకెట్‌ మర్చిపోయినట్లు గ్రహించాను. విమానం ఆఖరి వరుసలో మూడో సీటులో కూర్చున్నానని, నేను వెళ్లి దానిని తీసుకోవచ్చా అని ఫ్లైట్ అటెండెంట్‌ని అడిగాను. అతను వద్దు అన్నాడు. ఫెడరల్ చట్టం ప్రకారం నేను విమానం నుంచి దిగి పక్కన నిలబడాలి. తానే తీసుకువస్తానని అటెండెంట్‌ చెప్పాడు. నేను సరే అన్నాను.’ అని తెలిపింది.

* జాకెట్‌లో కనిపించని ఎయిర్‌పాడ్‌లు

అటెండెంట్ జాకెట్‌ను హెడెన్‌కు ఇచ్చాడు. తర్వాత ఆమె నెక్స్ట్ ఫ్లైట్‌లో సీటెల్‌కు బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన ఓ పిల్లవాడు అరుస్తుండటంతో.. ఆమె ఎయిర్‌పాడ్‌ల కోసం జాకెట్‌ పాకెట్‌లో చూసింది. ఎయిర్‌పాడ్‌లు కనిపించలేదు. దీంతో యాపిల్‌ డివైజ్‌లను ట్రాక్ చేసే Find My యాప్‌ని ఉపయోగించి ఎయిర్‌పాడ్‌ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. హెడెన్ విమానంలో Wi-Fiని ఉపయోగించుకుంది. యాప్‌లో ఎయిర్‌పాడ్‌లు మూవ్‌మెంట్‌లో ఉన్నట్లు కనిపించింది.

OnePlus: వన్‌ప్లస్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్ ..ఏప్రిల్ 4న లాంచ్..ధర, ఫీచర్ల వివరాలు..

* ట్రాకింగ్‌

హెడెన్‌ మాట్లాడుతూ.. ‘నేను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సీటెల్ వరకు మొత్తం మార్గాన్ని ట్రాక్ చేశాను. ఎయిర్‌పాడ్‌ మూవ్‌మెంట్స్‌ మొత్తం స్క్రీన్‌షాట్‌లు తీసుకున్నాను. సీటెల్ నుంచి నా ఇంటికి మరో గంట ప్రయాణం ఉంటుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్క్రీన్‌షాట్‌లు తీస్తూనే ఉన్నాను.’ అని చెప్పింది. ఎయిర్‌పాడ్‌ల మూవ్‌మెంట్‌ చివరికి USలోని బే ఏరియాలోని ఓ అడ్రస్ వద్ద ఆగిపోయింది. ఎయిర్‌పాడ్‌లు ఉన్న వ్యక్తికి తెలిసేలా.. హెడెన్ తన యాప్‌లో హెడ్‌ఫోన్స్ ‘లాస్ట్‌’ అని మార్క్‌ చేసి, తన మొబైల్ నంబర్‌ను పింగ్‌ చేసింది. అంతేకాకుండా, శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న శాన్ మాటియో పోలీస్ ఫోర్స్‌లోని డిటెక్టివ్ సహాయాన్ని తీసుకుంది.

డిటెక్టివ్ విమానాలలో ఆహారాన్ని లోడ్ చేసే విమానాశ్రయ కాంట్రాక్టర్‌ అడ్రస్‌లో ఎయిర్‌పాడ్‌లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు అతన్ని ప్రశ్నించారు. తనకు హెడ్‌ఫోన్‌లను క్లీనర్ ఇచ్చాడని, అంతకు మించి ఏమీ తెలియదని ఆ వ్యక్తి చెప్పాడు. చివరికి ఎయిర్‌పాడ్‌లు 12 రోజుల తర్వాత హెడెన్‌కి తిరిగి అందాయి. ఆమె ఎయిర్‌పాడ్‌లు బాగా దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేసింది. దీంతో హెడెన్ ప్రయాణించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్.. ఆమెకు 271 డాలర్లు, 5,000 ఎయిర్ మైల్స్‌ను అందజేసింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌పాడ్‌లు లభించిన ఉద్యోగిని ఎయిర్‌లైన్ నియమించుకోలేదని, వెండర్ ద్వారా విధుల్లో చేర్చుకున్నామని ధ్రువీకరించింది.

First published:

Tags: Apple, USA

ఉత్తమ కథలు