Tiktok Ban In US: టిక్ టాక్‌కు డెడ్‌లైన్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Tiktok Ban In US | మైక్రోసాఫ్ట్ లేదా మరో అమెరికా సంస్థ సెప్టెంబర్ 15నాటికల్లా టిక్ టాక్‌ను కొనుగోలు చేయనిపక్షంలో...ఆ వెంటనే దాన్ని అమెరికాలో బ్యాన్ చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు

news18-telugu
Updated: August 4, 2020, 12:21 PM IST
Tiktok Ban In US: టిక్ టాక్‌కు డెడ్‌లైన్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనా పాపులర్ ఆన్‌లైన్ గేమ్ - టిక్ టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేయబోతున్నట్లు రెండ్రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. టిక్ టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను కొనుగోలు చేసేందుకు దాని మాతృ సంస్థ బైట్ డాన్స్‌తో మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించిన మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల...దీనిపై డొనాల్డ్ ట్రంప్‌తోనూ మాట్లాడారు. టిక్ టాక్‌లో వాటాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయొద్దని ట్రంప్‌ను సత్య నాదెళ్ల కోరినట్లు తెలుస్తోంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించి డేటా సర్వర్లు అమెరికాలో మాత్రమే ఉంటాయని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికన్ యూజర్ల డేటాతో పాటు వారి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టంచేసినట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)


దీంతో సానుకూలంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్...టిక్ టాక్‌ను దేశంలో బ్యాన్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసే విషయంలో కాస్త ఓపికపడుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్‌కు మరో డెడ్ లైన్ విధించారు ట్రంప్. టిక్ టాక్‌ను సెప్టెంబర్ 15 నాటికల్లా అమెరికా కంపెనీ కొనుగోలు చేయకుంటే...అమెరికాలో బ్యాన్ చేస్తామని ట్రంప్ స్పష్టంచేశారు. అదే సమయంలో టిక్ టాక్‌లో అమెరికా కంపెనీ మెజార్టీ వాటాలు కొనుగోలు చేసినా వెనక్కి తగ్గేది లేదని..మొత్తం వాటాలు అమెరికా కంపెనీ కొనుగోలు చేస్తేనే బ్యాన్ విధించబోమని స్పష్టంచేశారు. దేశ భద్రతా కారణాలతో చైనా యాప్ టిక్ టాక్‌ను సహించేది లేదని సత్య నాదెళ్లకు స్పష్టంచేసినట్లు ట్రంప్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కాకున్నా...అమెరికాకు చెందిన ఏ ఇతర సంస్థ టిక్ టాక్‌ను కొనుగోలు చేసినా తనకు ఆమోదయోగ్యమేనన్నారు. అదే సమయంలో టిక్ టాక్‌ను కొనుగోలు డీల్‌లో భాగంగా..అమెరికా ఖజానాకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టంచేశారు.

మైక్రోసాఫ్ట్ లేదా మరేదైనా అమెరికా సంస్థ...సెప్టెంబర్ 15కల్లా టిక్ టాక్ కొనుగోలు డీల్‌ను పూర్తి చేయాలని ట్రంప్ సూచించారు. లేనిపక్షంలో తాను దేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తానని తేల్చిచెప్పారు.
Published by: Janardhan V
First published: August 4, 2020, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading