US UFO : అవిగో UFOలు... వీడియో రిలీజ్ చేసిన అమెరికా పెంటగాన్...

US UFO : ఎగిరే పళ్లాలలా కనిపించిన ఆ యుఎఫ్‌ఓలు ఎలాంటివి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయి?

news18-telugu
Updated: April 28, 2020, 12:26 PM IST
US UFO : అవిగో UFOలు... వీడియో రిలీజ్ చేసిన అమెరికా పెంటగాన్...
US UFO : అవిగో UFOలు... వీడియో రిలీజ్ చేసిన అమెరికా పెంటగాన్... (credit - twitter)
  • Share this:
US UFO : ఎగిరే పళ్లాలు లేదా UFOs (Unidentified Flying Objects) నిజంగానే ఉన్నాయని ఎవరైనా అంటే... అమెరికా అందుకు ఒప్పుకోదు. శతాబ్దాలుగా ఈ విషయాన్ని ఖండిస్తూనే ఉంది. అలాంటిది తొలిసారిగా అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ అధికారికంగా UFOలు ఉన్నాయని ఒప్పుకుంది. ఒప్పుకోవడమే కాదు... వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేసింది. అందులో రెండు రకాల ఎగిరే పళ్లాల వంటివి ఆకాశంలో మబ్బులకు పైన వెళ్తున్నట్లు కనిపిస్తున్నా్యి. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేసిందన్న ప్రశ్న మనకు రావడం సహజం. ప్రజల్లో ఉన్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే ఈ ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది.


ఈ ఫుటేజ్ మొత్తం మూడు వీడియోల కలయిక. ఇందులో ... అమెరికా నేవీ పైలట్లు తమ విమానాల్లో వెళ్తుండగా... ఈ చిత్రమైన ఆకారాలు కనిపించాయి. అవి ఏంటో అర్థం కాకపోవడంతో... వాటిని UFOలుగా ఇప్పుడు చెబుతున్నారు. ఆకాశంలో వర్ణించడానికి వీలుకాని దృశ్యాలుగా పెంటగాన్ వీటిని చెబుతోంది.


ఈ వీడియో క్లిప్పింగ్స్ చాలా కాలంగా ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతన్నాయి. చాలా మంది యూఫాలజిస్టులు... వీటిని ప్రజలకు చూపించి... అవిగో UFOలు అని చెబుతుంటే... అమెరికా ప్రభుత్వం ఏనాడూ ఈ ఫుటేజ్ నిజమైనదా, కల్పితమా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. అందువల్ల ఇదో మిస్టరీగా మారింది.


2004 నుంచి 2015 మధ్య నేవీ పైలట్లు ట్రైనింగ్ ఫ్లైట్లలో వెళ్తున్నప్పుడు ఈ దృశ్యాలు కనిపించినట్లు తెలిసింది. వీటిలో రెండు వీడియోలను 2017లో న్యూయార్క్ టైమ్స్ రిలీజ్ చేసింది. మరొకటి స్టార్స్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అనే సైన్స్ గ్రూప్ రిలీజ్ చేసింది.


ఇప్పుడు నిజంగానే UFOలు ఉన్నాయని అమెరికాయే స్వయంగా ఒప్పుకోవడంతో... గ్రహాంతర వాసులు ఉన్నారా... మనుషుల్ని కలిశారా... అన్న ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి.

అమెరికా... నెవాడాలోని ఏరియా 51 మిలిటరీ టెస్టింగ్ గ్రౌండ్‌లో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు)పై పరిశోధనలు జరుగుతున్నాయని యూఫాలజిస్టులు చెబుతున్నారు. అమెరికా మాత్రం ఏనాడూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
Published by: Krishna Kumar N
First published: April 28, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading