• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • US NAVY UFO VIDEO LEAKED FOOTAGE OF PYRAMID SHAPED UFOS IS REAL SAYS PENTAGON SAYS ARE ALIENS REALLY THERE NK GH

US navy UFO Video: అమెరికా నేవీ వీడియోలో UFOలు.. ఏలియ‌న్స్ నిజంగా ఉన్నారా?

US navy UFO Video: అమెరికా నేవీ వీడియోలో UFOలు.. ఏలియ‌న్స్ నిజంగా ఉన్నారా?

US navy UFO Video: అమెరికా నేవీ వీడియోలో UFOలు.. ఏలియ‌న్స్ నిజంగా ఉన్నారా? (image credit - twitter)

US navy UFO Video: అమెరికా నుంచి ఏదైనా రహస్యం బట్టబయలు కావాలంటే... దాన్ని అమెరికాయే బయటపెట్టాలి అనేలా ఉంది పరిస్థితి. తాజాగా గ్రహాంతరవాసులకు సంబంధించి UFO ఫుటేజ్ కలకలం రేపుతోంది.

  • Share this:
US navy UFO Video: ఈ భూమిపై అమెరికాకు ఉన్నంత రాడార్ నిఘా వ్యవస్థ మరే దేశానికీ లేదు. అందువల్ల అమెరికా నుంచి తప్పించుకొని వెళ్లడం ఏలియన్స్‌కి కూడా సాధ్యం కాదు అనుకోవచ్చు. అది నిజమేనని నిరూపిస్తూ... ఓ లీకైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అది అమెరికా నౌకాదళ అధికారులు... ఓ యుద్ధ నౌక నుంచి తీసిన వీడియో. అందులో త్రిభుజ (triangle) ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి. అవి వెళ్తున్నప్పుడు భారీగా కాంతిని వెదజల్లుతూ వెళ్లాయి. ఈ ఫుటేజ్‌ని గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్న వారు (UFO investigators)... రిలీజ్ చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో... అమెరికా ఆ పుటేజ్ నిజమైనదే అని చెప్పింది. మరి అందులో ఉన్నవి ఎగిరేపళ్లాలేనా (UFOs) కాదా అన్నది చెప్పలేదు.

డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ జెరెమీ కార్బెల్,... లాస్ వెగాస్ రిపోర్టర్ జార్జ్ క్నాప్ ఈ వీడియోని రీలిజ్ చేశారు. వీళ్లిద్దరూ దశాబ్దాలుగా UFO (గుర్తించని ఎగిరే వస్తువు లేదా ఎగిరేపళ్లెం)లపై పరిశోధన చేస్తున్నారు. ఈ వీడియో నైట్ విజన్ కమెరాతో తీసినది. అంటే ఆ ఎగిరే పళ్లేలు రాత్రి వేళ వెళ్లినట్లు లెక్క. ఇంతకుముందు ఇలాంటివే... FA-18 ఫైటర్ విమానం నుంచి పైలట్లు... కొన్ని ఫొటోలను మొబైల్ ద్వారా తీశారు. అవి కూడా ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ (Pentagon) ఈ వారం దీనిపై స్పందించింది. లీకైన ఫొటోలు, వీడియోలను... అమెరికా నేవీ దళ సిబ్బందే తీశారని చెప్పింది. ఐతే... వాటిలో ఉన్నది యూఎఫ్ఓలే అని మాత్రం చెప్పలేదు.


ఇంతకీ ఈ వీడియోలు, ఫొటోలు జెరెమీ కార్బెల్‌కి ఎలా దక్కాయనే డౌట్ వచ్చే ఉంటుంది. ఈ వీడియోలు, ఫొటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ దగ్గర షేర్ చేశారు. తద్వారా అవి లీక్ అయ్యాయి. వాటిని సంపాదించిన కార్బెల్... వాటిని రిపోర్టర్ జార్జ్ క్నాప్‌కి చూపించి... ఒరిజినల్లా కాదా అన్నది తేల్చారు. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Expensive Fruits: ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... ఒక్కటి కొనాలన్నా ఆస్తులు అమ్ముకోవాలి

గత రెండేళ్లుగా పెంటగాన్ అధికారులు... UFOలు ఉన్నాయి అనేలా ప్రకటనలు చేస్తున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం చెప్పట్లేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ సడెన్‌గా మాయమవుతున్న ఆ విచిత్ర వస్తువులు ఏంటన్నది తెలియట్లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయటపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు