హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Kawasaki Bike: ఇండియాలో అప్‌డేటెడ్ కవాసకి బైక్ లాంచ్.. లగ్జరీ బైక్ ప్రత్యేకతలు ఇవే..!

Kawasaki Bike: ఇండియాలో అప్‌డేటెడ్ కవాసకి బైక్ లాంచ్.. లగ్జరీ బైక్ ప్రత్యేకతలు ఇవే..!

కవాసకి న్యూ బైక్ లాంచ్

కవాసకి న్యూ బైక్ లాంచ్

ప్రీమియం బైక్స్‌తో రైడర్లకు స్పోర్టీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కవాసకి కంపెనీ ముందుంటుంది. ఈ బ్రాండ్‌ నుంచి ఇండియాలో మరో కొత్త బైక్ రిలీజ్ అయింది. అప్‌డేటెడ్ వెర్సిస్ 650 (Updated 2022 Kawasaki Versys 650) మోడల్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...

ప్రీమియం బైక్స్‌తో రైడర్లకు స్పోర్టీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కవాసకి కంపెనీ ముందుంటుంది. ఈ బ్రాండ్‌ నుంచి ఇండియాలో మరో కొత్త బైక్ రిలీజ్ అయింది. అప్‌డేటెడ్ వెర్సిస్ 650 (Updated 2022 Kawasaki Versys 650) మోడల్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లోని అవుట్‌గోయింగ్ బైక్ కంటే కొత్త వెర్షన్ ధర రూ.21,000 ఎక్కువగా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ.7,36,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ ఎంట్రీ-లెవల్ వెర్సిస్.. ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 (₹8.95 లక్షలు), హోండా CB500X (₹5.8 లక్షలు), సుజుకి V-Strom 650XT (₹8.85 లక్షలు) వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

తాజా వెర్సిస్ 650 మోడల్‌కు కంపెనీ కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేసింది. ఇది వెర్సిస్ 1000 లాంటి కొత్త ఫెయిరింగ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. రివైజ్డ్ ఫెయిరింగ్ డిజైన్ కారణంగా LED హెడ్‌లైట్ యూనిట్ల డిజైన్‌ను కూడా కాస్త మార్చారు. 4-స్టెప్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌ను అమర్చారు. మునుపటి కంటే ఇప్పుడు షార్ప్‌గా కనిపించే ఇంజిన్ కౌల్ అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే ఇవి మినహా మిగిలిన మిగతా స్పెసిఫికేషన్లలో పెద్దగా మార్పులు ఏవీ లేవు.


కవాసకి వెర్సిస్ 650 అప్‌డేటెడ్ బైక్ 4.3-అంగుళాల TFT స్క్రీన్‌తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు స్పెషల్ USB పోర్ట్ కూడా దీనికి ఉంది. 2022 వెర్సిస్ 650లో మరో కీలకమైన ఎలక్ట్రానిక్ అప్‌డేట్ ఉంది. దీని 2-స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్.. లో-ట్రాక్షన్ సర్ఫేస్‌లలో బెస్ట్ ABS మాడ్యులేట్ సపోర్ట్‌ను అందిస్తుంది. లేటెస్ట్ వెర్సిస్ 650ను అదే డైమండ్ ఫ్రేమ్ ఛాసిస్‌తో వస్తుంది. పాత మోడల్‌లోని 41mm USD ఫోర్క్‌లను కూడా అందించారు. ఫ్రంట్ వీల్ కోసం రీబౌండ్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్, 130 mm సస్పెన్షన్ ట్రావెల్‌ సిస్టమ్‌ ఉంది. బ్యాక్ వీల్ మాత్రం రిమోట్ స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో కూడిన సింగిల్-షాక్ స్ప్రింగ్‌ను కలిగి ఉంటుంది.

ఇంజిన్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా అలాగే ఉన్నాయి. వెర్సిస్ 650 లిక్విడ్-కూల్డ్, ప్యార్లల్- ట్విన్ 650 cc ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఇది 65 hp వపర్‌ను, 61 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫ్రంట్ వీల్ బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయల్ 300 మిమీ పెటల్ డిస్క్‌లు, బ్యాక్ వీల్ కోసం సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే 250 మిమీ నాన్-పెటల్డ్ డిస్క్-బ్రేక్ అందించారు.

2022 వెర్సిస్ 650 ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ బైక్‌ను లైమ్ గ్రీన్, మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. కొత్త మోటార్‌సైకిల్ కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. కవాసకి ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.

First published:

Tags: Auto News, Bikes, New bikes, Sports bike

ఉత్తమ కథలు