WhatsApp Alert: వాట్సప్‌పై సైబర్ ఎటాక్... వెంటనే యాప్ అప్‌‌డేట్ చేయండి

WhatsApp | యాప్ లోని వాయిస్ కాలింగ్ ఫంక్షన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి మాల్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపిస్తున్నట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన వాట్సప్... సమస్యను పరిష్కరించింది.

news18-telugu
Updated: May 14, 2019, 5:03 PM IST
WhatsApp Alert: వాట్సప్‌పై సైబర్ ఎటాక్... వెంటనే యాప్ అప్‌‌డేట్ చేయండి
WhatsApp Alert: వాట్సప్‌పై సైబర్ ఎటాక్... వెంటనే యాప్ అప్‌‌డేట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 14, 2019, 5:03 PM IST
వాట్సప్ యూజర్లకు హెచ్చరిక. మీరు వాట్సప్‌లో సీక్రెట్‌గా ఛాటింగ్ చేసుకుంటున్నామని అనుకోవచ్చు. కానీ మీ వాట్సప్ ఛాటింగ్ సీక్రెట్ ఏమీ కాదు. ఎవరైనా మీ ఛాటింగ్‌ను చూడొచ్చు. యూజర్ల జోక్యం లేకుండా ఇన్-యాప్ వాయిస్ కాల్స్ ద్వారా యూజర్లను టార్గెట్ చేసినట్టు బయటపడింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ 'అడ్వాన్స్‌డ్ సైబర్ యాక్టర్' పేరుతో స్పైవేర్ రూపొందించి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. యాప్ లోని వాయిస్ కాలింగ్ ఫంక్షన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి మాల్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపిస్తున్నట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన వాట్సప్... సమస్యను పరిష్కరించింది. వెంటనే యూజర్లు తమ వాట్సప్‌ని అప్‌డేట్ చేయాలని కంపెనీ అప్రమత్తం చేస్తోంది.

వాట్సప్ బగ్‌తో వచ్చే ముప్పు ఇదే...


వాట్సప్ యూజర్లకు గుర్తుతెలియని నెంబర్ నుంచి వాట్సప్‌లో వాయిస్ కాల్ వస్తుంది. అది జస్ట్ మిస్డ్ కాల్ మాత్రమే. ఆ కాల్ ద్వారా స్పైవేర్ ఫోన్‌లోకి వెళ్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను కాజేస్తుంది. మీ వాట్సప్ ఛాటింగ్‌లు, ఇతర వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి. మీరు ఒకవేళ వాట్సప్ కాల్ రిసీవ్ చేసుకోకపోయినా సరే మీ ఫోన్‌లోకి వైరస్ వెళ్తుంది. ఈ మాల్‌వేర్‌కు ఎంతమంది టార్గెట్ అయ్యారో లెక్క తేలలేదు. ఒకవేళ మీకు కూడా గుర్తు తెలియని నెంబర్ నుంచి వాయిస్ కాల్ వచ్చినా, మిస్డ్ కాల్ వచ్చినా వెంటనే మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయండి. ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అప్‌డేట్ వర్షన్ రిలీజ్ చేసింది వాట్సప్.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే

ఇవి కూడా చదవండి:



LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇచ్చేయండి ఇలా

Jio-OnePlus 7: వన్‌ప్లస్ 7 ఫోన్ కొంటే జియో నుంచి రూ.9,300 బెనిఫిట్స్... వివరాలివే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...