హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకుంటే హ్యాక్​ అయ్యే ప్రమాదం..

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకుంటే హ్యాక్​ అయ్యే ప్రమాదం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

టెక్ దిగ్గజం గూగుల్​కు చెందిన పాపులర్​ వెబ్​ బ్రౌజర్​ ‘గూగుల్​ క్రోమ్​’ను దాదాపు అందరూ వినియోగిస్తుంటారు. యూజర్లను అట్రాక్ట్​ చేయడంలో, యూజర్​ ఫ్రెండ్లీ ఎన్విరాన్​మెంట్​ అందించడంలో క్రోమ్​ సక్సెస్​ అయ్యింది. అందుకే స్మార్ట్​ఫోన్స్​, కంప్యూటర్స్​, ల్యాప్​టాప్స్ ఇలా దేనిలో అయినా గూగుల్​ క్రోమ్ బ్రౌజరే యూజర్లకు ఫస్ట్​ ఛాయిస్​. అటువంటి పాపులర్​ వెబ్​ బ్రౌజర్​లో సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

టెక్ దిగ్గజం గూగుల్​కు చెందిన పాపులర్​ వెబ్​ బ్రౌజర్​ ‘గూగుల్​ క్రోమ్​’ను దాదాపు అందరూ వినియోగిస్తుంటారు. యూజర్లను అట్రాక్ట్​ చేయడంలో, యూజర్​ ఫ్రెండ్లీ ఎన్విరాన్​మెంట్​ అందించడంలో క్రోమ్​ సక్సెస్​ అయ్యింది. అందుకే స్మార్ట్​ఫోన్స్​, కంప్యూటర్స్​, ల్యాప్​టాప్స్ ఇలా దేనిలో అయినా గూగుల్​ క్రోమ్ బ్రౌజరే యూజర్లకు ఫస్ట్​ ఛాయిస్​. అటువంటి పాపులర్​ వెబ్​ బ్రౌజర్​లో సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు గూగుల్​ క్రోమ్​ ద్వారా మీ సిస్టమ్​లోకి చొరబడి విలువైన డేటాను దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే పీసీ, ల్యాప్​టాప్​లో వాడే క్రోమ్​ పాత వెర్షన్లను కొత్త వెర్షన్లకు అప్​డేట్​ చేయాలని కోరుతున్నారు. లేదంటే మీ పీసీ, ల్యాప్​టాప్​ హ్యాకింగ్​కు గురై విలువైన డేటా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే ఈ ఏజెన్సీ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.

ఇందులో భాగంగానే గూగుల్​ క్రోమ్​ పాత వెర్షన్​పై రిమోట్​ పద్దతిలో హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉందని, త్వరగా అప్​డేట్​ చేసుకోవాలని యూజర్లను హెచ్చరించింది. యూజర్లు ప్రస్తుతం వాడుతున్న వెర్షన్ నుంచి 92.0.4515.131 లేటెస్ట్ వెర్షన్​కు క్రోమ్ బ్రౌజర్​ను అప్​డేట్ చేసుకోవాలని కోరింది. బుక్​మార్క్​లలో బఫర్ ఓవర్‌ఫ్లో లోపం కారణంగా గూగుల్ క్రోమ్​ హ్యాకింగ్​ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఈ విభాగం స్పష్టం చేసింది. విండోస్​, లైనెక్స్​, మాక్​ ఓఎస్​ల నావిగేషన్​ కోసం చేసిన మార్పుల్లో సెక్యూరిటీ లోపం వెలుగు చూసిందని సెక్యూరిటీ టీం పేర్కొంది. ఫైల్ సిస్టమ్ API, బ్రౌజర్ UI లేదా పేజ్​ ఇన్ఫో యూఐలో ఈ లోపాలు గుర్తించినట్లు తెలిపింది.

ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంట్‌ను వెబ్​ బ్రౌజర్​లోకి చొప్పించడం ద్వారా సైబర్​ నేరగాళ్లు మన డేటా హ్యాక్ చేస్తున్నారు. అందువల్ల యూజర్లు తమ క్రోమ్​ బ్రౌజర్​ను త్వరగా పాత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్​కు అప్​డేట్​ చేసుకోవాలని CERT-In పేర్కొంది. యాపిల్​ ఐఫోన్​, ఐప్యాడ్​ యూజర్లు తమ డివైజెస్​ను ఐఓఎస్​ 14.7.1, ఐప్యాడ్​ ఓఎస్​ 14.7.1కు అప్​డేట్ ​చేసుకోవాలని గతంలోనే CERT-In కోరిన విషయం తెలిసిందే. గతంలో iOS, iPad OS రెండింటిలోనూ సెక్యూరిటీ లోపాలను గుర్తించింది.

First published:

Tags: Google, Technology, Windows

ఉత్తమ కథలు