YouTube : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) ఇటీవలే పించ్ టు జూమ్, ప్రిసైస్ సీకింగ్, న్యూ లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ బటన్స్, యాంబియంట్ మోడ్ తదితర ఫీచర్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ల వల్ల యూట్యూబ్ లుక్, ఇంటర్‌ఫేస్ పూర్తిగా మారిపోయాయి. తాజాగా యూట్యూబ్ మరో కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో యూట్యూబ్ ఛానెల్ పేజీలలోని షార్ట్స్ (Shorts), లైవ్ స్ట్రీమ్‌లు (Live Streams), లాంగ్-ఫామ్ వీడియోలను మూడు వేర్వేరు ట్యాబ్‌లలో ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అంటే యూట్యూబ్ కొత్త అప్‌డేట్ ద్వారా ఛానల్ ఇంట్రో పేజీలోనే లాంగ్ వీడియోల కోసం ఒక ట్యాబ్, షార్ట్స్ కోసం మరో ట్యాబ్, లైవ్ స్ట్రీమ్ వీడియోల కోసం ఇంకో ట్యాబ్ అందించనుంది.
ప్రస్తుతానికి యూట్యూబ్‌లో ఏదైనా ఛానల్ ఓపెన్ చేయగానే మనకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ వంటి ట్యాబ్స్ కనిపిస్తాయి. వీడియోస్ ట్యాబ్‌పై నొక్కిన తర్వాత లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోస్, లైవ్ స్ట్రీమ్ వీడియోలన్నీ కలిసే కనిపిస్తాయి. వీడియోస్ ట్యాబ్‌లో వేర్వేరు వీడియో కంటెంట్ సపరేటు ఫిల్టర్లలో కనిపిస్తుంది కానీ సపరేట్‌గా ట్యాబ్స్ అందుబాటులో లేవు. అయితే కొత్త అప్‌డేట్‌తో ఒక క్రియేటర్ ఛానల్ పేజ్ ఓపెన్ చేయగానే హోమ్ ట్యాబ్ పక్కనే వీడియోస్, షాట్స్, లైవ్ అనే మూడు టాప్స్ సపరేట్‌గా కనిపిస్తాయి. వీడియోస్ ట్యాబ్‌పై క్లిక్ చేసినప్పుడు ఓన్లీ లాంగ్ వీడియోలు మాత్రమే కనిపిస్తాయి. షార్ట్స్ పై క్లిక్ చేసినప్పుడు ఓన్లీ షార్ట్స్ మాత్రమే ప్రత్యక్షమవుతాయి. ఇక లైవ్ ట్యాబ్ కూడా కేవలం లైవ్ స్ట్రీమ్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ ట్యాబ్స్‌లో మీరు వీడియోలను ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఇందుకు యూట్యూబ్ ప్రతి ట్యాబ్‌లో రీసెంట్లీ అప్‌లోడెడ్, పాపులర్ అనే రెండు ఫిల్టర్స్ అందుబాటులో ఉంచింది.
https://twitter.com/nealmohan/status/1585742149034725376?t=5wpslCCv_-yaeJ7fMpbFcw&s=19
"మేం ఇప్పుడు మీ వీడియో కంటెంట్‌ను 3 వేర్వేరు ట్యాబ్‌లుగా విభజించే కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాం! వీడియోల ట్యాబ్ లాంగ్-ఫామ్ వీడియోలు మాత్రమే చూపిస్తుంది. షార్ట్‌ల ట్యాబ్ షార్ట్స్ మాత్రమే చూపిస్తుంది. లైవ్ ట్యాబ్ గత, ప్రస్తుత & అప్‌కమింగ్ లైవ్ స్ట్రీమ్స్ చూపిస్తుంది." అని యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ ట్వీట్ చేస్తూ ఒక ఫొటో కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలో క్రియేటర్ ఛానల్ పేజీలోనే హోమ్, షార్ట్స్, లైవ్ ట్యాబ్‌లు సపరేట్‌గా కనిపించాయి. సపరేట్ ట్యాబ్స్ తీసుకురావడం వల్ల షార్ట్ వీడియోల వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుందని యూట్యూబ్ చెబుతోంది. ముఖ్యంగా కేవలం షార్ట్స్ మాత్రమే చూడాలనుకునే యూజర్ల వల్ల వీటి వ్యూస్ పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
రెండు రోజుల క్రితం యూట్యూబ్ హెల్ప్ పేజీ ఈ అప్‌డేట్ గురించి కీలక విషయాలను వెల్లడించింది. ఈ అప్‌డేట్‌ను అక్టోబర్ 27 నుంచి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఈ అప్‌డేట్ మరికొద్ది వారాల్లో అందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. యూట్యూబ్ హెల్ప్ పేజీ ప్రకారం, ఇకపై వీడియోల ట్యాబ్‌లో షార్ట్‌లు లేదా లైవ్ స్ట్రీమ్‌లను యూజర్లు చూడలేరు. అయితే తాజాగా తీసుకొచ్చిన ఈ అప్‌డేట్‌ను యూజర్లు ప్రశంసిస్తున్నారు. ఒక నిర్దిష్ట తేదీకి సంబంధించిన వీడియోలు సులభంగా చూసేలా కొత్త ఫిల్టర్లు అందిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube