హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Galaxy Smartphones: శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త మోడల్స్.. 2023లో రానున్న లగ్జరీ డివైజెస్ ఇవే..

Galaxy Smartphones: శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త మోడల్స్.. 2023లో రానున్న లగ్జరీ డివైజెస్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గెలాక్సీ S, A, Z సిరీస్‌లో వచ్చిన మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. అయితే వీటికి సక్సెసర్‌గా వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త గెలాక్సీ డివైజ్‌లను శామ్‌సంగ్ తీసుకురానుంది. ఈ లిస్ట్‌లో ఉన్న ఐదు టాప్ మోడల్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లోకి ఎన్ని కొత్త టెక్ కంపెనీలు వచ్చినా, టాప్ బ్రాండ్లలో ఎప్పటికీ ఉండే పేరు శామ్‌సంగ్. ఈ కంపెనీ అన్ని సెగ్మెంట్లలో కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు తయారు చేస్తుంది. ముఖ్యంగా గెలాక్సీ S, A, Z సిరీస్‌లో వచ్చిన మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. అయితే వీటికి సక్సెసర్‌గా వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త గెలాక్సీ డివైజ్‌లను శామ్‌సంగ్ తీసుకురానుంది. ఈ లిస్ట్‌లో ఉన్న ఐదు టాప్ మోడల్స్ ఏవో చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ A54

గెలాక్సీ A54 ఫోన్ సరికొత్త కెమెరా సెటప్‌తో రానుంది. 6.4 అంగుళాల AMOLED 120Hz ప్యానెల్, 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, Exynos 7904 చిప్‌సెట్‌ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు. ఈ ఫోన్‌ డిజైన్‌ పరంగా గెలాక్సీ S23 మాదిరిగా, కొత్త అప్‌డేట్స్‌తో రానుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా

ఈ స్మార్ట్‌ఫోన్ పాత గెలాక్సీ S22 అల్ట్రా మోడల్‌తో పోలిస్తే సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో రానుంది. గెలాక్సీ S23 అల్ట్రా మోడల్ స్పెసిఫికేషన్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఈ ఫోన్ S పెన్ స్టైలస్‌తో వస్తుంది. డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ బీఫ్డ్ అప్ వేరియంట్‌తో పనిచేస్తుంది. దీంట్లో 200MP ప్రైమరీ కెమెరా, 10X ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉంటాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5

ఈ స్మార్ట్‌ఫోన్ కూడా వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు. అయితే దీని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇది గెలాక్సీ Z ఫోల్ట్ 4 మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా రావచ్చు. డిజైన్ పరంగా కొన్ని మార్పులు ఉండవచ్చు. కొత్త మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, అడ్వాన్స్‌డ్ కెమెరాలు ఉంటాయి. కంపెనీ ఈ డివైజ్‌లో రీడిజైన్డ్ హింగ్ సిస్టమ్‌ను వాడి, డిస్ప్లే క్రీజ్‌ను తగ్గించనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S23, గెలాక్సీ S23 ప్లస్

ఈ ఫోన్లు బీఫ్డ్ అప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో రానున్నాయి. గెలాక్సీ S23లో 3700mAh బ్యాటరీ ఉంటుంది. డిజైన్ పరంగా ఈ రెండు ఫోన్లలో చాలా అప్‌గ్రేడ్స్ ఉంటాయి. వీటి ముందు భాగం అదే యూనిఫామ్ బెజెల్ డిజైన్‌లో ఉంటుంది. అయితే ఫోన్ల వెనుక భాగం S22 అల్ట్రా-ఎస్క్యూ కెమెరా స్టైల్‌లో ఉంటూ, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5

ఇది మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పట్టవచ్చు. అయితే ఇప్పటికే దీని డిజైన్, కొన్ని స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు వచ్చాయి. గెలాక్సీ Z ఫ్లిప్ 5 ఫోన్‌లో 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండవచ్చు. బెస్ట్ వ్యూఫైండర్‌ కెమెరాలు దీంట్లో ఉంటాయని సమాచారం. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, అడ్వాన్స్‌డ్ కెమెరా సెన్సార్‌లతో రానుంది. కొత్త హింగ్ డిజైన్ డిస్‌ప్లేలో క్రీజ్‌ను తగ్గించి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.

First published:

Tags: Samsung Galaxy, Smartphones

ఉత్తమ కథలు