WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం

WhatsApp New Features | కొత్తకొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు యూజర్లను అలరించబోతున్నాయి. ఆ ఫీచర్లు రిలీజ్ కంటే ముందే యూజర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.

news18-telugu
Updated: August 31, 2019, 5:03 PM IST
WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం
WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 31, 2019, 5:03 PM IST
వాట్సప్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని మెస్సెంజర్ అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ ఉందంటే అందులో వాట్సప్ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకు 150 కోట్ల యూజర్లతో వాట్సప్ సృష్టిస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌తో యాప్‌ను మరింత అందంగా, సౌకర్యవంతంగా మార్చేస్తోంది వాట్సప్. అంతేకాదు... కొత్తకొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు యూజర్లను అలరించబోతున్నాయి. ఆ ఫీచర్లు రిలీజ్ కంటే ముందే యూజర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసేలా చేస్తున్నాయి. మరి ఆ ఫీచర్లు ఏంటీ? వాటితో ఉపయోగమేంటీ? అందులో మీకు నచ్చేవేంటీ? తెలుసుకోండి.

1. Dark Mode: డార్క్ మోడ్... ఇటీవల బాగా చర్చకు వస్తున్న ఫీచర్. ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 లో మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్‌నే డార్క్‌ మోడ్‌లోకి మార్చేయొచ్చు. వాట్సప్‌లో కూడా డార్క్ మోడ్ త్వరలో రాబోతోంది. వాట్సప్‌లో డార్క్ మోడ్ వస్తే కళ్లకు అలసట తగ్గించడంతో పాటు బ్యాటరీని ఆదా చేస్తుంది.

2. Boomerang Videos: బూమరాంగ్ వీడియో ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్. ఆ ఫీచర్ త్వరలో వాట్సప్‌లో కూడా రానుంది. ఇప్పటికే ప్యానెల్‌లో వీడియో లేదా GIF ఫార్మాట్‌ సెలెక్ట్ చేసుకోవచ్చు. త్వరలో బూమరాంగ్ ఫార్మాట్ కూడా రావొచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి అధికారికంగా ప్రకటన అయితే లేదు.

3. Memoji stickers: యూజర్లు పర్సనలైజ్డ్ స్టిక్కర్స్, ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి మెమొజీ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు 2.19.90.23 బీటా వర్షన్‌లో మెమొజీ ఫీచర్‌ను అందించింది వాట్సప్. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ వస్తుంది.



4. Albums: వాట్సప్ వెబ్‌ వర్షన్‌లో కొత్తగా ‘Albums’ ఫీచర్ రానుంది. ఫోటోస్, వీడియోస్‌ని గ్రూప్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. మొబైల్ యాప్‌లో 2018లోనే ఈ ఫీచర్ వచ్చింది. వెబ్ వర్షన్‌కు కూడా రానుంది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి

Loading...
ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి షిరిడీ టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

Revolt: నెలకు రూ.2999 చెల్లించి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...