Home /News /technology /

UPCOMING BUDGET PHONES FROM TECHNO COMPANY 50MP CAMERA 7GB VIRTUAL RAM AND MANY MORE FEATURES UMG GH

Tecno Spark 8P: టెక్నో కంపెనీ న్యూ బడ్జెట్ ఫోన్స్.. 50MP కెమెరా.. ఇంకా మరెన్నో ఫీచర్లు..!

అధునాతన ఫీచర్లతో రానున్న టెక్నో ఫోన్

అధునాతన ఫీచర్లతో రానున్న టెక్నో ఫోన్

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) ఇటీవలే 7000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో టెక్నో పోవా 3ని చౌక ధరలో లాంచ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు టెక్నో స్పార్క్ 8పీ (Tecno Spark 8P) పేరుతో మరో బడ్జెట్ ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు అదిరిపోయే బడ్జెట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తుంటుంది. ఇటీవలే 7000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో టెక్నో పోవా 3ని చౌక ధరలో లాంచ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు టెక్నో స్పార్క్ 8పీ (Tecno Spark 8P) పేరుతో మరో బడ్జెట్ ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌కి సంబంధించి రెండు టీజర్లను తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసింది. దాంతో ఇండియాలో ఈ టెక్నో ఫోన్ లాంచ్‌ ఖాయమైంది. ఈ టీజర్లు టెక్నో స్పార్క్ 8పీ స్పెసిఫికేషన్లు, డిజైన్లు స్పష్టంగా వెల్లడించాయి. ఆ ఫీచర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


గతేడాదిలోనే గ్లోబల్ మార్కెట్లలో టెక్నో స్పార్క్ 8పీ లాంచ్ అయింది. ఇప్పుడు దీనిని ఇండియాలో విడుదల చేయడానికి టెక్నో సన్నాహాలు చేస్తోంది. టెక్ రిపోర్ట్స్ ప్రకారం, టెక్నో స్పార్క్ 8పీ ఈ నెలలోనే లాంచ్ అవ్వచ్చు. టెక్నో మొబైల్ ఇండియా తాజాగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో రెండు వీడియో క్లిప్స్‌ షేర్ చేసింది. అద్భుతమైన ఫొటోలు తీసే 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, రోజంతా పవర్ అందించే అతిపెద్ద 7GB వర్చువల్ ర్యామ్‌తో టెక్నో స్పార్క్ 8పీ త్వరలో వస్తుందని ఈ టీజర్స్ ద్వారా టెక్నో కంపెనీ పేర్కొంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7GB వర్చువల్ ర్యామ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించడంతో మొబైల్ ప్రియులలో ఆసక్తి పెరిగింది. ఈ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అవసరమైనప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్‌ని ర్యామ్‌గా కూడా వాడుకుంటుంది. తద్వారా ఫోన్ ఎలాంటి పెద్ద టాస్క్ అయిన ల్యాగ్ లేకుండా ఫర్ఫామ్ చేయగలదు. ఈ మొబైల్ 50MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ కానుందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్లూ కలర్ వేరియంట్‌తో మొబైల్ అందుబాటులోకి రావచ్చని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇక మిగతా ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కొన్ని రీసెంట్ లీక్స్‌ ఇండియన్ వేరియంట్‌ ఫీచర్లను వెల్లడించాయి. అలాగే గ్లోబల్ లాంచ్ వేరియంట్ కూడా ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్స్‌తో వస్తుందో తెలియజేస్తోంది. టెక్నో స్పార్క్ 8పీ ఎక్స్‌పెక్టెడ్ ఫీచర్స్‌పై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

* టెక్నో స్పార్క్ 8పీ ఫీచర్లు
గతంలో వచ్చిన లీక్‌ల ప్రకారం, టెక్నో స్పార్క్ 8పీ ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. సెల్ఫీ కెమెరా ఉన్న భాగంలో వాటర్ డ్రాప్ నాచ్‌ డిజైన్ అందించారని తెలుస్తోంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా అందించగా... వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాను అందించినట్లు లీక్స్ పేర్కొంటున్నాయి. కాగా మిగిలిన రెండు కెమెరాలు ఎన్ని మెగాపిక్సెల్స్‌తో వస్తున్నాయనేది మాత్రం లీక్స్ వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ వేరియంట్‌లో 2MP పోర్ట్రెయిట్, AI లెన్స్ ప్రైమరీ కెమెరా తో పాటుగా బ్యాక్ సైడ్ అందించారు. భారత్‌లో విడుదలయ్యే వేరియంట్‌లో కూడా అవే కెమెరాలు అందించొచ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G70, 5,000mAh బ్యాటరీని ఆఫర్ చేయవచ్చు. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, DTS స్టీరియో స్పీకర్ సెటప్‌ ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ టర్కోయిస్ సియాన్, అట్లాంటిక్ బ్లూ, ఐరిస్ పర్పుల్, కోకో గోల్డ్ అనే నాలుగు రంగులలో అందుబాటులోకి వచ్చింది. మరి ఇండియాలో కూడా నాలుగు కలర్ ఆప్షన్స్‌తో ఫోన్ రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Mahesh
First published:

Tags: 5g mobile, 5g technology, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు