2022 నాటికి 70 శాతం ఫ్యాషన్ సేల్స్ మొబైల్‌లోనే!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు ఫ్యాషన్ వేర్ కూడా ఇ-కామర్స్ సైట్‌లోనే ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఈ అలవాటు ఇప్పుడు చాలా తక్కువే. 2022 నాటికి 70 శాతం ఫ్యాషన్ యాక్సెసరీస్ మొబైల్‌లోనే కొంటారని ఓ నివేదిక సారాంశం.

news18-telugu
Updated: August 1, 2018, 12:05 PM IST
2022 నాటికి 70 శాతం ఫ్యాషన్ సేల్స్ మొబైల్‌లోనే!
image: Reuters
  • Share this:
తలకు పెట్టుకునే క్యాప్ దగ్గర్నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. అయితే చాలామంది దుస్తులు, చెప్పులు, షూ లాంటివి ఆన్‌లైన్‌లో కొనేందుకు ఇష్టపడరు. తీరా ప్రొడక్ట్ వచ్చాక అది సరిపోకపోతే ఎలా అన్న భయం కాస్త ఉంటుంది. కానీ భవిష్యత్తు అలా ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మొబైల్‌ ద్వారా కొనే వస్తువుల్లో సగానికి పైగా ఫేస్‌బుక్ కారణమని ఆ సంస్థకు చెందిన "జీరో ఫ్రిక్షన్ ఫ్యూచర్" రిపోర్ట్ చెబుతోంది. ఈ లెక్క 110 బిలియన్ డాలర్లు ఉంటుందని అంనచా.

భారతదేశంలో ఫ్యాషన్ రంగం చాలా పెరిగింది. దుస్తులు, యాక్సెసరీ మార్కెట్ ప్రస్తుతం 102 బిలియన్ డాలర్లు ఉంది. 2022 నాటికి 155 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. పలు బ్రాండ్లు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు మొబైల్ మాధ్యమంగా మారింది. నేరుగా కస్టమర్లకు సేవలు అందుతున్నాయి. ఫ్యాషన్ బ్రాండ్స్ తమ వస్తువులు అమ్ముకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మేం సాయం అందిస్తాం.
పుల్కిత్ త్రివేది, డైరెక్టర్, ఫేస్‌బుక్ ఇండియా


2022 నాటికి మొబైల్ ద్వారానే 70 శాతం ఫ్యాషన్ యాక్సెసరీ కొనుగోళ్లు ఉంటాయని తాజా నివేదికలు చెబుతుండటంతో ఫేస్‌బుక్ దానిపై దృష్టిపెట్టింది.
First published: August 1, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...