Rail Drishti: ప్రయాణికులకు రైల్వే గిఫ్ట్... సమస్త సమాచారం అందించే 'రైల్ దృష్టి'

Railway New Rules: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

మీరు ప్రయాణించాలనుకున్న రైలు ఎక్కడ ఉంది? ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వంటలు ఎలా వండుతున్నారు? ఇలా మొత్తం తెలుసుకోవచ్చు. అంతేకాదు... దేశంలో ఉన్న అన్ని ఐఆర్‌సీటీసీ కిచెన్లలో అమర్చిన సీసీకెమెరా దృశ్యాలను మీరు లైవ్‌లో చూడొచ్చు.

  • Share this:
    కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సోమవారం 'రైల్ దృష్టి' డ్యాష్‌బోర్డ్ పోర్టల్‌ను ప్రారంభించారు. రైల్వేకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. రైల్ టైమ్ టేబుల్, మీరు ప్రయాణించాలనుకున్న రైలు ఎక్కడ ఉంది? ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వంటలు ఎలా వండుతున్నారు? ఇలా మొత్తం తెలుసుకోవచ్చు. అంతేకాదు... దేశంలో ఉన్న అన్ని ఐఆర్‌సీటీసీ కిచెన్లలో అమర్చిన సీసీకెమెరా దృశ్యాలను మీరు లైవ్‌లో చూడొచ్చు. ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వండిన పదార్థాలు తినాలంటే వామ్మో అంటారు ప్రయాణికులు. కారణం... ఆహారపదార్థాలు సరిగ్గా ఉండకపోవడమే. ప్రయాణికుల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు, కిచెన్‌లో ఏం జరుగుతుందో ప్రయాణికులే చూసేందుకు... కిచెన్ లోపలి దృశ్యాలను ప్రయాణికులు చూసే సౌకర్యం కల్పించింది రైల్వే. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా భారతీయ రైల్వే 'రైల్ దృష్టి' డ్యాష్ బోర్డ్ ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    Rail Drishti, Rail Drishti dashboard, Indian railways dashboard, indian railways, piyush goyal, irctc kitchen live feed, irctc kitchen live visuals, రైల్ దృష్టి, రైల్ దృష్టి డ్యాష్‌బోర్డ్, ఇండియన్ రైల్వేస్ డ్యాష్ బోర్డ్, పీయూష్ గోయల్, ఐఆర్‌సీటీసీ కిచెన్, ఐఆర్‌సీటీసీ కిచెన్ లైవ్ విజువల్స్
    image: https://www.raildrishti.cris.org.in

    'రైల్ దృష్టి' డ్యాష్ బోర్డుతో ఉపయోగమేంటీ?


    మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్... ఎందులో అయినా 'రైల్ దృష్టి' డ్యాష్‌బోర్డ్ ఓపెన్ చేసి చూడొచ్చు.
    రైల్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకోవచ్చు.
    త్వరలో ఐఆర్‌సీటీసీ యాప్‌ను 'రైల్ దృష్టి' డ్యాష్ బోర్డుకు అనుసంధానిస్తారు.
    ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో శుభ్రతను లైవ్‌లో చూడొచ్చు.
    ఐఆర్‌సీటీసీ కిచెన్‌లో వంటలు ఎలా వండుతున్నారో చూడొచ్చు.
    రైల్వే టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు.
    రైలు ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు.
    పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
    రైలులో ప్రతీ ఫుడ్ ప్యాకెట్‌పై బార్‌కోడ్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఏ క్యాంటీన్‌లో ప్యాక్ చేశారో తెలుస్తుంది.
    ఏదైనా కిచెన్‌లో పరిశుభ్రత కనిపించకపోతే మీరు నేరుగా raildrishti.org.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయొచ్చు.

    Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

    ఇవి కూడా చదవండి:

    PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

    LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
    First published: