Twitter: ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందంటూ..

ట్విట్టర్ లోగో

Twitter: ట్విటర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపణలు గుప్పించింది.

  • Share this:
    సోషల్ మీడియా దిగ్గజం, భారత ప్రభుత్వం మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్‌పై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందని ట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందని ధ్వజమెత్తింది. ట్విటర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపణలు గుప్పించింది. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విటర్ ప్రయత్నిస్తోందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అంతేకాదు భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్‌ చూస్తోందని కేంద్రం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ అంశంపై ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అనంతరం కేంద్రం తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ట్విట్టర్.. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

    చట్టం ప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే కేంద్రంపై విమర్శలు చేసింది. కొంతకాలంలో భారత్‌లో తమ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, తాము సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయన్నది తమ ఆందోళన అని ట్విట్టర్ పేర్కొంది. ఇలాంటి చట్టాలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించింది. సోషల్‌ మీడియాలో ప్రశాంత చర్చలకు భంగం కలగకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరింది. ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదే అని ట్విటర్‌ స్పష్టం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published: