Ultrasonic bracelet : అల్ట్రాసోనిక్ బ్రాస్‌లెట్... దీన్ని పెట్టుకోవాల... మాట్లాడుకోవాల

Ultrasonic bracelet : ఈ అల్ట్రాసోనిక్ బ్రాస్‌లెట్... చుట్టూ ఉన్న మైక్రోఫోన్స్‌ని జామ్ చేస్తుంది. తద్వారా మీ సంభాషణ మీకే తెలుస్తుంది. అలాగే... చుట్టుపక్కల వాళ్లు మీ సంభాషణ వినే ఛాన్స్ ఉండదు.

news18-telugu
Updated: February 17, 2020, 9:26 AM IST
Ultrasonic bracelet : అల్ట్రాసోనిక్ బ్రాస్‌లెట్... దీన్ని పెట్టుకోవాల... మాట్లాడుకోవాల
Ultrasonic bracelet : అల్ట్రాసోనిక్ బ్రాస్‌లెట్... దీన్ని పెట్టుకోవాల... మాట్లాడుకోవాల
  • Share this:
Ultrasonic bracelet : ఇప్పటివరకూ బ్రాస్‌లెట్ అనేది చేతికి అందం కోసం, ఫ్యాషన్ స్టైల్ కోసమే వాడేవాళ్లు. ఇప్పుడీ బ్రాస్‌లెట్‌లోనూ టెక్నాలజీని సెట్ చేశారు. ఫలితంగా దీన్ని చేతికి తగిలించుకుంటే... దీన్ని ఆన్ చెయ్యగానే... చుట్టుపక్కల అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మైక్రోఫోన్స్‌ని జామ్ చేస్తుంది. ఇప్పటివరకూ ఉన్న జామర్ల కంటే... ఇది ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుండటంతో... అందరూ ఈ బ్రాస్‌లెట్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఓ బ్యాటరీని సెట్ చేశారు. న్యూయార్క్‌లో ఇన్వెస్టర్లు... ఇలాంటి బ్రాస్‌లెట్ తయారుచెయ్యమని కోరడంతో... యూనివర్శిటీ ఆఫ్ చికాగో టెక్నాలజిస్టులు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దీని రేటు రూ.1400గా నిర్ణయించారు. దీన్ని చేతికి తగిలించుకున్నాక... బటన్ నొక్కి ఆన్ చెయ్యగానే... ఇది చుట్టుపక్కల ఉన్న మైక్రోఫోన్లను జామ్ చేస్తుంది. అందువల్ల మీరు మాట్లాడుకునే విషయాలు, మేటర్లూ... పక్కవారికి తెలియవు. అందువల్ల బయట జరిగే బిజినెస్ మీటింగ్స్‌లో ఏం మాట్లాడుకున్నదీ బయటివారికి తెలియదు. రాజకీయ నాయకులు కూడా ఏదైనా మాట్లాడుకోవాలంటే... సీక్రెట్‌గా మాట్లాడుకునేందుకు వీలవుతుంది. ఐతే... దీన్ని వాడేటప్పుడు లీగల్‌గా వచ్చే సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇతరుల మైక్రోఫోన్లను జామ్ చేస్తే... వారు అభ్యంతరం చెప్పే ప్రమాదం ఉంది.



First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు