• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • UIDAI MADE NEW CHANGES IN MAADHAAR APP FOR TO ADD UPTO 5 AADHAAR PROFILES IN MAADHAAR APP NS

మీరు mAadhaar యాప్ వాడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలుసుకోండి

మీరు mAadhaar యాప్ వాడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2017 లో mAadhaar యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారులు 'ఆధార్ కార్డ్' ప్రింట్ ఫార్మాట్ ను వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అయితే...

  • Share this:
    డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2017 లో mAadhaar యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారులు 'ఆధార్ కార్డ్' ప్రింట్ ఫార్మాట్ ను వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ UIDAI రూపొందించింది. ఇప్పడు ఈ యాప్ కు UIDAI కొత్త అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ కొత్త అప్ డేట్ తో ఐదుగురి ఆధార్ కార్డు ప్రొఫైల్‌లను ఇప్పుడు mAadhaar లో చేర్చే అవకాశం ఏర్పడింది. యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంతకు ముందు mAadhaar యాప్ కు గరిష్టంగా మూడు ప్రొఫైల్‌లను చేర్చే అవకాశం ఉండేది. ఈ యాప్ వినియోగదారుల పేరు, పుట్టిన తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నంబర్ లింక్‌లను కలిగి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ mAadhaar ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వారి ప్రొఫైల్‌ను కూడా అప్‌డేట్ చేయవచ్చు.

    ఇదిలా ఉంటే.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన mAadhaar యాప్‌ను మీరు వాడుతున్నారా? అయితే వెంటనే ఆ యాప్ డిలిట్ చేయండి. మళ్లీ కొత్తగా యాప్ ఇన్‌స్టాల్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఐఓఎస్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేయండి. గతంలో ఇన్‌స్టాల్ చేసిన mAadhaar యాప్‌ను డిలిట్ చేసి కొత్తగా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలని కోరుతోంది UIDAI.



    ఇటీవల mAadhaar యాప్‌ ఫీచర్స్‌లో పలు మార్పుల్ని చేసింది UIDAI. అందుకే సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాత యాప్ డిలిట్ చేసి ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేయాలని కోరుతోంది. మీరు ఇటీవల కాకుండా గతంలో mAadhaar యాప్‌ డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నట్టైతే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. కొత్తగా mAadhaar యాప్‌ డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు