యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన mAadhaar యాప్‌ను మీరు వాడుతున్నారా? అయితే వెంటనే ఆ యాప్ డిలిట్ చేయండి. మళ్లీ కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఐఓఎస్ యూజర్లు అయితే ఇక్కడ క్లిక్ చేయండి. గతంలో ఇన్స్టాల్ చేసిన mAadhaar యాప్‌ను డిలిట్ చేసి కొత్తగా మళ్లీ ఇన్స్టాల్ చేయాలని కోరుతోంది UIDAI. ఇటీవల mAadhaar యాప్ ఫీచర్స్‌లో పలు మార్పుల్ని చేసింది UIDAI. అందుకే సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాత యాప్ డిలిట్ చేసి ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాలని కోరుతోంది. మీరు ఇటీవల కాకుండా గతంలో mAadhaar యాప్ డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నట్టైతే అన్ఇన్స్టాల్ చేయండి. కొత్తగా mAadhaar యాప్ డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి
Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా
For best experience of the #mAadhaar App, uninstall any previously installed versions. Download the latest version from:https://t.co/62MEOf8J3P (Android)https://t.co/GkwPFzM9eq (iOS) pic.twitter.com/fS9mCzc62x
— Aadhaar (@UIDAI) February 9, 2021
ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఆన్లైన్లోనే సేవలు అందించేందుకు mAadhaar యాప్‌ను రూపొందించింది UIDAI. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో ఉపయోగించొచ్చు. mAadhaar యాప్ ద్వారా 35 రకాల ఆధార్ సేవల్ని అందిస్తోంది UIDAI. యాప్‌లో Main Service Dashboard, Request Status Services, My Aadhaar లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఆధార్ ప్రొఫైల్‌లో రిజిస్టర్ చేసి ఆధార్ సేవలు పొందొచ్చు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్, రీప్రింట్, స్కాన్ క్యూఆర్ కోడ్, ఇకేవైసీ డౌన్లోడ్, అడ్రస్ అప్డేట్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ లేదా ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి 35 రకాల సేవల్ని mAadhaar యాప్‌లో పొందొచ్చు.
Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే మార్చేయండి ఇలా
Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా
Get more than 35 Aadhaar services like download eAadhaar, update status, locate Aadhaar Kendra etc. on your smartphone. Download the #mAadhaarApp from:https://t.co/62MEOf8J3P (Android)https://t.co/GkwPFzM9eq (iOS) pic.twitter.com/wTei36WCpw
— Aadhaar (@UIDAI) February 8, 2021
mAadhaar యాప్‌లో మూడు ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఒకరు యాప్ డౌన్లోడ్ చేసి కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. వారి ఆధార్ సేవల్ని కూడా పొందొచ్చు. ఎక్కడైనా ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా చూపించాలనుకుంటే mAadhaar యాప్‌లోని ఆధార్ కార్డును చూపించొచ్చు. రైలు ప్రయాణం సందర్భంలో కూడా ఎంఆధార్ యాప్‌లోని ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, Ios, Mobile App, Playstore, UIDAI