Home /News /technology /

UBER WILL MAKE IT HARDER FOR DRIVERS TO CANCEL YOUR RIDES UMG GH

Uber: ఉబెర్ రైడర్లకు గుడ్ న్యూస్.. రైడ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ మరింత తగ్గే అవకాశం..!

ఉబెర్ రైడర్లకు గుడ్ న్యూస్.. రైడ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ మరింత తగ్గే అవకాశం..!

ఉబెర్ రైడర్లకు గుడ్ న్యూస్.. రైడ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ మరింత తగ్గే అవకాశం..!

రైడ్ క్యాన్సిల్ సమస్యను తొలగించేందుకు ఉబెర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ రైడర్ల సౌకర్యార్థం డ్రైవర్లు రైడ్స్‌ను రద్దు చేసే అవకాశాన్ని తగ్గించనుంది. ఈ మేరకు ఉబెర్ అనేక అప్‌డేట్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది.

రైడ్ షేరింగ్ యాప్స్ వాడే యూజర్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య రైడ్ క్యాన్సిల్ (Ride Cancel) అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో క్యాష్ రూపంలో ఛార్జీ చెల్లించాలని పట్టుబట్టడం లేదా ఒక డెస్టినేషన్ గిట్టుబాటు కాదని రైడ్ హఠాత్తుగా క్యాన్సిల్ చేయడం డ్రైవర్లకు అలవాటుగా మారిపోయింది. దీంతో యూజర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు ప్రముఖ టాక్సీ సర్వీస్ ఉబెర్ (Uber) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ రైడర్ల సౌకర్యార్థం డ్రైవర్లు రైడ్స్‌ను రద్దు చేసే అవకాశాన్ని తగ్గించనుంది. ఈ మేరకు ఉబెర్ అనేక అప్‌డేట్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉబెర్ అప్‌ఫ్రంట్ ఫేర్ (Upfront) అనే ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఫీచర్ అనేది డ్రైవర్లు ఒక ట్రిప్ నుంచి ఎంత సంపాదిస్తారు? వారు ఎక్కడికి వెళుతున్నారు? వంటి విషయాలను ముందుగానే తెలియజేస్తుంది. అప్పుడు డ్రైవర్ ట్రిప్‌ను అంగీకరించాలా వద్దా అనేది సులభంగా నిర్ణయించుకోగలుగుతాడు. ఫలితంగా అనవసరంగా రైడ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్‌లు తగ్గుతాయి. "మా కొత్త ట్రిప్ రిక్వెస్ట్ స్క్రీన్ అనేది ఒక రైడ్ తమ సమయం, శ్రమకు తగినదా కాదా అని డ్రైవర్లు నిర్ణయించుకోవడంలో సాయపడుతుంది. రైడ్‌కు సంబంధించి అన్ని వివరాలను అందించడం ద్వారా వారు ఎంత సంపాదిస్తారు? వారు ఎక్కడికి వెళుతున్నారు ముందుగానే తెలియజేస్తుంది" అని ఉబెర్ ఒక బ్లాగ్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు భారీగా జీతాలు ఆఫర్..!


కొత్త ఫీచర్ డ్రైవర్లు మరింత సమాచారం సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఉబెర్ కంపెనీ తెలిపింది. దీనివల్ల ట్రిప్ క్యాన్సిలేషన్లు తగ్గుతాయని పేర్కొంది. ఒక ట్రిప్‌కు తనకు ఎంత డబ్బు లభిస్తుందో, అతను ఎక్కడికి వెళ్తున్నాడో ముందుగానే తెలిస్తే డ్రైవర్ ట్రిప్‌ను రద్దు చేయడు. అప్పుడు రైడర్లు తమ రైడ్‌లు రద్దు అవుతాయనే భయం లేకుండా ప్రయాణాలు చేయడం వీలవుతుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే వివిధ నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, యాప్‌తో లాగిన్ అయ్యే స్వేచ్ఛ లభించడంతో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారని ఉబెర్ తెలిపింది. రైడ్ గురించి మరిన్ని వివరాలను అందించడం వల్ల అటు డ్రైవర్లు, ఇటు రైడర్లు ప్రయోజనం పొందుతారని తెలిపింది.



ఉబెర్ క్యాబ్స్ సంస్థ జులై నెల ప్రారంభంలో డ్రైవర్‌ల కోసం ఒక ప్రత్యేక ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్ వారు ట్రిప్‌ని అంగీకరించే ముందు వారు ఎక్కడికి వెళ్లాలో ముందుగానే తెలుపుతుంది. రైడర్లు, డ్రైవర్‌ల కోసం భారతదేశం అంతటా ఉబెర్ ప్లాట్‌ఫామ్‌లోని డ్రైవర్లు ఇప్పుడు రైడ్‌ని అంగీకరించే ముందు ట్రిప్ డెస్టినేషన్ చూడగలుగుతారు. ట్రిప్ క్యాన్సిలేషన్‌ల సంఖ్యను తగ్గించడానికి అన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను ఉబెర్ అందుబాటులోకి తెచ్చింది. ట్రిప్ డెస్టినేషన్ తెలిపే ఈ ఫీచర్‌పై ఉబెర్ డ్రైవర్లు, రైడర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అవసరమైతే దీనిలో మార్పులు చేస్తామని చెబుతోంది.
Published by:Mahesh
First published:

Tags: Bike rides, Cabs, Drivers, Uber

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు