Home /News /technology /

UBER INTRODUCES PUBLIC TRANSPORT SERVICE IN DELHI PARTNERS WITH DELHI METRO SK

ఉబెర్ యాప్‌తో మెట్రో ప్రయాణం.. టోకెన్, కార్డ్ అవసరం లేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డెన్వర్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, ప్యారిస్, సిడ్నీలో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించింది ఉబెర్. ఇక ఆసియాలో తొలిసారిగా ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్సిట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది.

    ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబెర్ భారత్‌లో మరో సర్వీసును ప్రారంభించింది. ఉబెర్‌ యాప్‌లో ఇప్పటి వరకు కార్లు, బైక్స్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఐతే ఇకపై ఉబర్ యాప్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఉబెర్ ఒప్పందం చేసుకుంది. భారత్‌లో తొలిసారిగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది ఉబెర్. ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఫీచర్‌ను మెట్రో అధికారులతో కలిసి లాంచ్ చేశారు. త్వరలోనే ఉబెర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది.


    ఈ ఫీచర్ ద్వారా ఫస్ట్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచి ఉబెర్ క్యాబ్ బుక్‌లో వెళ్లే ప్రయాణికులు .. అదే యాప్‌తో మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. దీనికి ప్రత్యేకంగా టోకెన్, స్మార్ట్ కార్డ్ అవసరం లేదు. మెట్రో స్టేషన్ ఎంట్రెన్స్ గేట్స్ వద్ద క్యూర్ కోడ్‌ను ఉబెర్ యాప్‌తో స్కాన్ చేయాల్సి ఉంటుంది. గేట్స్ తెరచుకోగానే నేరుగా ప్లాట్‌ఫాంపైకి వెళ్లి రైలు ఎక్కవచ్చు. ఇక జర్నీ పూర్తయ్యాక దిగాల్సిన స్టేషన్‌లో ఎగ్జిట్ గేట్స్ వద్ద మళ్లీ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అదే స్టేషన్‌లో క్యాబ్ బుక్ చేసుకొని నేరుగా ఇల్లు లేదా ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఈ మొత్తం జర్నీకి మొత్తం అయిన అద్దెను ఇల్లు లేదా ఆఫీసు వద్ద దిగిన తర్వాత చెల్లించువచ్చు.

    ఉబెర్‌లో పబ్లిక్ ట్రాన్సిట్ ఫెసిలిటీ ప్రస్తుతం అమెరికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. డెన్వర్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, ప్యారిస్, సిడ్నీలో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించింది ఉబెర్. ఇక ఆసియాలో తొలిసారిగా ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్సిట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సిడ్నీ తర్వాత ఇండియాలోనే ఈ ఫీచర్‌ను ప్రారంభించడం విశేషం. ఢిల్లీలో 210 మెట్రో స్టేషన్‌లలో ఉబెర్ సేవలు అందుబాటులో ఉంటాయని ఉబెర్ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో సక్సెస్ అయితే మిగిలిన నగరాల్లోనూ ప్రారంభించాలని యోచిస్తోంది ఉబెర్.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi metro, New Delhi, Uber

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు