Home /News /technology /

UBER INTRODUCES AUDIO RECORDING FEATURE FOR RIDERS DRIVERS DETAILS HERE JNK GH

Uber: ఉబెర్ నుంచి కొత్త ఫీచర్.. రైడర్స్, డ్రైవర్ల కోసం ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ పరిచయం

రైడర్స్, డ్రైవర్ల్ కోసం ఉబర్ నుంచి కొత్త పీచర్

రైడర్స్, డ్రైవర్ల్ కోసం ఉబర్ నుంచి కొత్త పీచర్

Uber: ఉబెర్‌ కొత్త ఇన్-యాప్ సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సాయంతో డ్రైవర్‌లతో పాటు ప్రయాణికులు తమ ట్రిప్పుల సమయంలో ఆడియోను రికార్డ్ చేయవచ్చు.

క్యాబ్ సేవలు (Cab Service) అందిస్తున్న ప్రముఖ సంస్థ ఉబెర్‌ (uber) తమ డ్రైవర్లు, ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఉబెర్‌ కొత్త ఇన్-యాప్ సేఫ్టీ ఫీచర్‌ను (Safety Feature) పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ సాయంతో డ్రైవర్‌లతో పాటు ప్రయాణికులు తమ ట్రిప్పుల సమయంలో ఆడియోను రికార్డ్ చేయవచ్చు. లాటిన్ అమెరికాలో ఉబెర్‌ సేవలు వినియోగిస్తున్న వ్యక్తులకు సురక్షితమైన అనుభూతిని అందించేలా ఆడియో రికార్డింగ్ అనే ఫీచర్‌ను సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ ఇప్పుడు బ్రెజిల్, మెక్సికోతో సహా లాటిన్ అమెరికాలోని డజనుకు పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.

ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఆడియో ఫైల్ ఎన్‌క్రిప్ట్ అవుతుందని.. ఇది రైడర్, డ్రైవర్ డివైజ్ లలో కూడా స్టోర్ కాదని కంపెనీ చెబుతోంది. బై డిఫాల్ట్‌గా ఉబెర్‌ తో సహా ఎవరూ ఆడియో రికార్డ్ ను వినలేరని సంస్థ వివరించింది. ఎవరైనా వినియోగదారు ఉబెర్‌‌కు సేఫ్టీ రిపోర్ట్ ను సమర్పించినట్లయితే.. వారు తమ నివేదికకు ఈ ఆడియో ఫైల్‌ను జోడించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

WhatsApp: వాట్సాప్​లో కొత్త ఫీచర్​.. డిసప్పియరింగ్​ సమయాన్ని 9‌‌0 రోజులకు సెట్ చేసుకునే అవకాశం




రైడర్‌లు, డ్రైవర్‌లు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత మ్యాప్ స్క్రీన్‌పై షీల్డ్ ఐకాన్ పై నొక్కి “రికార్డ్ ఆడియో”ని సెలెక్ట్ చేసి ఆడియోను రికార్డ్ చేయవచ్చు. రైడర్‌లు, డ్రైవర్‌లు వ్యక్తిగత ట్రిప్పులను రికార్డ్ చేయవచ్చు. డ్రైవర్‌లు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఫీచర్‌ను ఆన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. లాటిన్ అమెరికా అంతటా ప్రయాణంలో ఉన్నప్పుడు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది. రియో ​​డి జెనీరోలో దాదాపు 70 శాతం మంది రైడర్లు, డ్రైవర్లు ఈ ఫీచర్ ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితంగా ఫీల్ అయ్యామని తెలిపారు.

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సేల్ మొదలైంది... నోట్ 10టీ కన్నా బెటరా?


ఉబెర్ సంస్థ RideCheck అనే మరొక అద్భుతమైన సాంకేతికతను అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఒక ట్రిప్ ప్రారంభమైన తర్వాత డ్రైవర్ వేరే మార్గంలో వెళుతున్నా.. లేదా రైడర్ చివరి గమ్యస్థానానికి ముందు ట్రిప్ అనూహ్యంగా ముగిసినా ఈ RideCheck సాంకేతికత గుర్తిస్తుంది. ఉబెర్‌ మొదటిసారిగా RideCheckని 2019లో పరిచయం చేసింది. డ్రైవర్ స్మార్ట్‌ఫోన్‌లోని GPS డేటా, సెన్సార్‌లను ఉపయోగించి, సాధ్యమయ్యే క్రాష్‌లను లేదా ట్రిప్ సమయంలో అసాధారణంగా లాంగ్ స్టాప్‌ను గుర్తించడానికి దీనిని పరిచయం చేసింది. డ్రైవర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, సంస్థ త్వరలో కొత్త ప్రోయాక్టివ్, ఆడియో సీట్ బెల్ట్ అలర్ట్‌ను లాంచ్ చేయనుంది. ఇది ట్రిప్ ప్రారంభంలో రైడర్‌లను సీట్ బెల్ట్ పెట్టుకోమని గుర్తు చేస్తుంది. ఈ ఆడియో అలర్ట్ అనేది డ్రైవర్ ఫోన్ నుంచి రైడర్ ఫోన్ కు అందుతుంది. ఒక పుష్ నోటిఫికేషన్ కూడా రైడర్ కు అందుతుంది. ఈ ఫీచర్ 2022 ప్రారంభంలో యూఎస్ లో అందుబాటులోకి వస్తుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: New feature, Uber

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు