Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...

ఊబెర్ సరికొత్త ఫీచర్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మీరు డ్రైవర్‌కు కాల్‌ చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్ కనిపించదు. VoIP ఆధారంగా కాల్స్ వెళ్తాయి.

news18-telugu
Updated: February 13, 2019, 9:54 AM IST
Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...
Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...
news18-telugu
Updated: February 13, 2019, 9:54 AM IST
ఊబెర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు కాల్ చేయడం చాలామందికి అలవాటు. అయితే మీరు కాల్ చేసినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఊబెర్ డ్రైవర్‌కు కనిపిస్తుంది. అయితే ఇలా నెంబర్ ఇతరులకు కనిపించడం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ... సర్వీస్ వాడుకోవాలంటే ఇది తప్పదు. కానీ... ఇకపై మీకు ఇలాంటి బెంగ అవసరం లేదు. ఊబెర్ సరికొత్త ఫీచర్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మీరు డ్రైవర్‌కు కాల్‌ చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్ కనిపించదు. VoIP ఆధారంగా కాల్స్ వెళ్తాయి.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

ఊబెర్‌లో VoIP ఫీచర్ ఇలా వాడుకోవచ్చు



మొదట మీరు ఊబెర్ యాప్ ఓపెన్ చేయండి.
పికప్, డ్రాప్ లొకేషన్ ఎంటర్ చేసి క్యాబ్ బుక్ చేయండి.


క్యాబ్ బుక్ చేసిన తర్వాత మీకు కాలింగ్ బటన్ కనిపిస్తుంది. అందులో మీరు వాయిస్ కాల్ లేదా ఫ్రీ కాల్ ఎంచుకోవచ్చు.
Loading....
మీరు ఫ్రీ కాల్‌పై క్లిక్ చేస్తే VoIP ఫీచర్ ద్వారా కాల్ వెళ్తుంది.
ఇందుకోసం యాప్ మీ మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతుంది.
పర్మిషన్ ఇచ్చిన తర్వాత డ్రైవర్ పేరు, కాల్ టైమర్ కనిపిస్తుంది.
డ్రైవర్‌ ఫోన్ స్క్రీన్‌పై మీ పేరు కనిపించదు. కేవలం ‘Uber’ అని మాత్రమే కనిపిస్తుంది.

ఇండియాలో VoIP ఫీచర్ అందిస్తున్న తొలి రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఊబెర్ కావడం విశేషం. యూజర్ల ప్రైవసీ విషయంలో విషయంలో కాంపిటీటర్ల కన్నా రెండు అడుగులు ముందే ఉంది.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

అపర కుబేరులే కాదు... దానగుణంలో వీరు అపర కర్ణులే

Valentine's Day: ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...