Home /News /technology /

UBER BRINGS BACK CARPOOLING SERVICE BUT UNDER A NEW NAME UMG GH

Uber: ఉబెర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ రైడ్ షేరింగ్ సర్వీస్.. కొత్త పేరుతో లాంచ్..

ఉబెర్ రైడ్ సరికొత్తగా లాంచ్.

ఉబెర్ రైడ్ సరికొత్తగా లాంచ్.

ఉబెర్ రైడ్స్ షేర్ చేసుకునే ఫెసిలిటీని మళ్లీ లాంచ్ చేసింది. అయితే ఈసారి ఉబెర్‌ఎక్స్ షేర్ (UberX Share) అనే కొత్త పేరుతో ఈ ఫీచర్‌ని అమెరికాలోని యూజర్లకు ఇంట్రడ్యూస్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా క్యాబ్‌ సేవలు అందిస్తోన్న ఉబెర్‌ (Uber).. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. అయితే కోవిడ్ వల్ల ఈ సంస్థ తన రైడ్ సర్వీస్‌లలోని అందరికీ ఫేవరెట్ అయిన షేర్డ్‌ రైడ్ సర్వీస్ ఫీచర్‌ను తొలగించింది. కరోనా కారణంగా ప్యాసింజర్ల శ్రేయస్సు మేరకు కంపెనీ ఉబెర్‌పూల్ (UberPool) ఫీచర్‌ను రిమూవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ రైడ్స్ షేర్ చేసుకునే ఫెసిలిటీని లాంచ్ చేసింది. అయితే ఈసారి ఉబెర్‌ఎక్స్ షేర్ (UberX Share) అనే కొత్త పేరుతో ఈ ఫీచర్‌ని అమెరికాలోని యూజర్లకు ఇంట్రడ్యూస్ చేసింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, ఫీనిక్స్, శాన్ డియాగో, పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్, ఇండియానాపోలిస్, పిట్స్‌బర్గ్‌ వంటి యూఎస్ నగరాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఉబెర్‌ఎక్స్ షేర్ ఫీచర్ మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలోనే లాంచ్ కానుంది.

కొత్త షేర్డ్ రైడ్స్ ఫీచర్ ఉబెర్ గతంలో తీసుకొచ్చిన కార్‌పూలింగ్ ఫీచర్‌ లాగానే పనిచేస్తుంది. ఉబెర్‌పూల్‌తో ప్యాసింజర్లు తాము వెళ్లే దారిలోనే ఇతర ప్యాసింజర్లతో రైడ్‌ షేర్ చేసుకొని డబ్బు ఆదా చేసుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన ఉబెర్‌ఎక్స్ షేర్‌తో రైడర్లు అదే దిశలో ఉన్న మరొక సహ-రైడర్‌తో ప్రయాణించవచ్చు. కానీ రైడర్లు కేవలం ఒక కో-రైడర్‌తో మాత్రమే రైడ్ షేర్ చేసుకోగలరు. రైడ్‌ షేర్ చేసే క్రమంలో ఎక్కువ సమయం గడిపినందుకు గానూ ఉబెర్ రైడర్లకు మొత్తం ఛార్జీలపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ తెలిపింది. రైడర్లు కో-రైడర్‌తో ఒకే డెస్టినేషన్‌కు వెళ్లకపోయినా తమ రైడ్‌పై అప్-ఫ్రంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ విధంగా మొత్తం ఛార్జీలు గణనీయంగా తగ్గించుకోవచ్చు.



ఈ ఫీచర్ వల్ల మీరు వెళ్లాలనుకున్న డెస్టినేషన్‌కు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. పికప్‌లు, డ్రాప్-ఆఫ్‌ల వల్ల ఎక్కువ ఆలస్యం కాకుండా ఒకే డైరెక్షన్‌లో వెళ్లే రైడర్‌లను మాత్రమే రైడ్ షేరింగ్ సజెస్ట్ చేస్తామని ఉబెర్ కంపెనీ తెలిపింది. ఉబెర్‌ఎక్స్ రైడ్ సమయం కంటే ఉబెర్‌ఎక్స్ షేర్‌ వల్ల 8 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యం కాదని కంపెనీ వెల్లడించింది. ఉబెర్‌ఎక్స్ షేర్ కోసం ఛార్జీలు ఎల్లప్పుడూ ఉబెర్‌ఎక్స్ రైడ్ కంటే తక్కువగా ఉంటాయని ఒక కంపెనీ పేర్కొంది. ఉబెర్‌పూల్‌తో పోలిస్తే ఉబెర్‌ఎక్స్ షేర్‌తో అదనపు నగదు ప్రోత్సాహకం అందుకోవచ్చు. ఉబెర్ ఇప్పుడు రైడర్లు డ్రైవర్ పక్కనే ఫ్రంట్ సీట్‌లో కూర్చునేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే స్థానిక మాస్క్ రూల్స్ ప్రకారం రైడర్లు మస్క్ ధరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. నిజానికి ఉబెర్‌ఎక్స్ షేర్‌ని టెస్ట్ చేసేందుకు నవంబర్‌లోనే లాంఛనప్రాయంగా కంపెనీ లాంచ్ చేసింది. పైలట్ పరీక్షలో భాగంగా మియామిలో మాత్రమే పరిచయం చేసింది.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Features, Taxi, Uber

తదుపరి వార్తలు