హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo Smartphones: వచ్చే నెలలో వివో నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మార్కెట్లోకి రానున్న మోడల్స్ ఇవే..

Vivo Smartphones: వచ్చే నెలలో వివో నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మార్కెట్లోకి రానున్న మోడల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) పాత సిరీస్ ఫోన్లను రీఫ్రెష్ చేస్తోంది. కంపెనీ నుంచి గతంలో విడుదలైన T-సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్లను తీసుకురావడంపై కంపెనీ దృష్టి పెట్టింది.

స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ సంస్థ వివో (Vivo) పాత సిరీస్ ఫోన్లను రీఫ్రెష్(Refresh) చేస్తోంది. కంపెనీ(Company) నుంచి గతంలో విడుదలైన T-సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు(Smartphone) మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్లను తీసుకురావడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వివో T1 ప్రో (Vivo T1 Pro), వివో T1 44W (Vivo T1 44W) ఫోన్లను రూపొందించింది. ఈ రెండు ఫోన్‌లను కంపెనీ మే 4న ఇండియాలో లాంచ్ చేయనుంది. వివో సేల్స్ ఛానెల్స్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇవి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

వివో T1 ప్రో ఫోన్ 8GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేసిన స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని కంపెనీ హైలైట్ చేసింది. దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ పేజీని కూడా ఏర్పాటు చేసింది. ఈ చిప్‌సెట్ శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G, ఐక్యూ Z6 ప్రో 5G వంటి కొన్ని ముఖ్యమైన డివైజ్‌లలో ఉంది. వివో T1 ప్రో ఫోన్.. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది డివైజ్‌ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 50 శాతానికి చార్జ్ చేయగలదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రామాణికంగా మారిన USB-C పోర్ట్‌తో ఈ ఫోన్ వస్తుంది. కొత్త ఫోన్ల ధరలు, కెమెరా, డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లు మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్నాయని ఫ్లిప్‌కార్ట్ పేజీ హైలైట్ చేస్తుంది.

Shocking: వీడిని ఏం చేసినా పాపం లేదు..సొంత చెల్లెళ్లపై అత్యాచారం..అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..

వివో T1 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీని బ్యాక్ కెమెరా సెటప్ వేరే డిజైన్‌లో ఉంటుంది. సర్క్యులర్ హౌసింగ్ లోపల పెద్ద సెన్సార్, మరో రెండు సెన్సార్లను మనం గమనించవచ్చు. వివో T1 ప్రో.. ఇప్పటికే ఇండియాలో రూ. 23,999 నుంచి అందుబాటులో ఉన్న iQoo Z6 Pro 5G ఫోన్ లాగా కనిపిస్తుంది. వివో సబ్-బ్రాండ్ అయిన ఐక్యూ రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో 8GB RAM, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో వివో T1 ప్రో స్మార్ట్‌ఫోన్.. iQoo Z6 Pro 5G మోడల్‌కు రీబ్రాండెడ్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త ఫోన్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వివరాలను ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ పేజీలో పొందుపర్చారు.

మరోవైపు, Vivo T1 44W ఫోన్.. ఈ ఫిబ్రవరిలో ఇండియాఓ లాంచ్ అయిన Vivo T1 మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Vivo T1 44W ఫోన్ కూడా iQoo Z6 4G మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఈ ఐక్యూ ఫోన్ కూడా ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అయితే Vivo T1 స్నాప్‌డ్రాగన్ 685 SoCతో వస్తుండగా, iQoo Z6 4G స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

First published:

Tags: 5g technology, Technology, Vivo

ఉత్తమ కథలు