హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Brain Blood Barrier: ఇక ఆ ప్రాణాంతక వ్యాధిని ముందే గుర్తించొచ్చు.. అదరగొట్టిన 2 ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు!

Brain Blood Barrier: ఇక ఆ ప్రాణాంతక వ్యాధిని ముందే గుర్తించొచ్చు.. అదరగొట్టిన 2 ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు!

Brain Blood Barrier: ఇక ఆ ప్రాణాంతక వ్యాధిని ముందే గుర్తించొచ్చు.. అదరగొట్టిన 2 ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు!

Brain Blood Barrier: ఇక ఆ ప్రాణాంతక వ్యాధిని ముందే గుర్తించొచ్చు.. అదరగొట్టిన 2 ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు!

Algorithm | గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే బ్రెయిన్ బ్లడ్ బారియర్ అనేది ప్రాణాంతక వ్యాధిగా మారుతూ వస్తోంది. దీన్ని ముందే గుర్తించే సాంకేతికతను ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Machine Learning | బ్లడ్ బ్రెయిన్ బారియర్ (బీబీబీ) అనేది గత కొన్ని సంవత్సరాలుగా ప్రాణాంతకమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధిగా మారుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరు ఇండో- అమెరికన్ శాస్త్రవేత్తలు బ్లడ్ బ్రెయిన్ బారియర్‌ను ముందుగానే గుర్తించే సాంకేతికతను ఆవిష్కరించారు. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ వెంకట రవికిరణ్ కొల్లా, సీనియర్ డేటా అనలిస్ట్ రీసెర్చర్ నిహారికా రెడ్డి మీనిగ ఈ అద్భుతాన్ని ఆవిష్కంచారు. బ్లడ్ బ్రెయిన్ బారియర్‌ను ముందుగానే గుర్తించడానికి డెసిషన్ ట్రీ-బేస్డ్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు.

బ్లడ్ బ్రెయిన్ బారియర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ప్రాణాంతకరమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధులలో ఒకటిగా, చాలా ప్రమాదకరంగా ఆవిర్భవించింది. 76 మిలియన్ల మంది ప్రజలు, వీరిలో ఎక్కువ మంది 65 ఏళ్లకు పైనే వయసు ఉన్న వారు, ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్రెయిన్ బారియర్ బారిన పడ్డారు. ఈ వ్యాధి సోకిన రోగులలో దాదాపు 10 శాతం మంది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఉన్నారు.

రూ.1000 ఫుడ్ జస్ట్ రూ.200కే పొందొచ్చట.. జొమాటోలో పెద్ద స్కాం.. బయటపెట్టిన డెలివరీ బాయ్..

ఈ బ్లడ్ బ్రెయిన్ బారియర్ ప్రధానంగా వైట్ మ్యాటర్ (డబ్ల్యూఎం), గ్రే మ్యాటర్ (జీఎం) వంటి మెదడు కణజాలాలను కోల్పోవడం వల్ల సంభవిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బ్లడ్ బ్రెయిన్ బారియర్ అనేది సెరెబ్రా స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణాన్ని పెంచుతుంది. బ్లడ్ బ్రెయిన్ బారియర్ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే.. ప్రారంభ దశలో మతిమరుపు వస్తుంది. తర్వాతి దశలో మాట్లాడలేకపోతారు. అలాగే జ్ఞాపక శక్తి వంటివి కోత్పోతారు.

బీఎస్‌ఎన్ఎల్ అదిరే శుభవార్త.. కస్టమర్లకు కొత్త సర్వీసులు, 1000కి పైగా ఛానళ్లు చూడొచ్చు!

బ్లడ్ బ్రెయిన్ బారియర్ సోకిన వారిలో కొన్నిసార్లు వ్యాధి లక్షణాలను స్నేహితులు, బంధువులు కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి బ్లడ్ బ్రెయిన్ బారియర్ రోగిగా మారడానికి ఇంటర్మీడియట్ దశ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపారిమెంట్ (ఎంసీఐ)గా చెప్పుకుంటారు. చాలా సందర్భాలలో బ్లడ్ బ్రెయిన్ బారియర్ అనేది ప్రాణాంతక వ్యాధిగా మారొచ్చు. శాస్త్రవేత్తలు ప్రమాదాలను తగ్గించడానికి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ ద్వారా ప్రత్యామ్నాయ పరిష్కారాలను కనుగొన్నారు. అందువల్ల బ్లడ్ బ్రెయిన్ బారియర్‌ను కూడా తొలి దశలోనే గుర్తించాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే దీనికి క్లినికల్ డయాగ్నసిస్ అనేది లేదు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు నిహారికారెడ్డి మీనిగ, వెంకట రవికిరణ్ కొల్లాలు కలిసి సకాలంలో పరిష్కారాన్ని కనుగొన్నారు.

వెంకట రవికిరణ్ కొల్లా, నిహారికా రెడ్డి మీనిగ మెషిన్ లెర్నింగ్ ఆధారిత అల్గారిథమ్‌లను అభివృద్ధి చేశారు. వీళ్లు ఒక సంవత్సరం నుంచి బ్లడ్ బ్రెయిన్ బారియర్‌పై పరిశోధన చేస్తున్నారు. డబ్ల్యూఎం, జీఎంలో గణనీయమైన కణజాల క్షీణత, సీఎఫ్ఎఫ్ తదుపరి పెరుగుదల అనేది బ్లడ్ బ్రెయిన్ బారియర్‌కు దారి తీస్తుందని కనుగొన్నారు.

First published:

Tags: America, Artificial intelligence, India, Learning

ఉత్తమ కథలు