ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) బుధవారం బ్లూటిక్ వెరిఫికేషన్‌తో కూడిన ట్విట్టర్ (Twitter) బ్లూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లాంచ్ చేశారు. ఈ ప్లాన్ తీసుకున్నవారు బ్లూటిక్ మార్క్ పొందొచ్చు. అయితే మామూలు యూజర్స్‌కి, అఫీషియల్ అకౌంట్స్ మధ్య తేడాను తెలియజేసేలా మస్క్ 'అఫీషియల్' లేబుల్‌ను కూడా లేటెస్ట్ అప్డేట్తో పరిచయం చేశారు. నిజానికి కొత్త ప్లాన్ విడుదలైన కొద్ది గంటల్లోనే దాన్ని కొనేసి.. వెరిఫికేషన్ బ్యాడ్జి పొంది ప్రముఖుల వలె నటిస్తూ కొందరు పెద్ద గందరగోళాన్ని సృష్టించారు. దానికి తోడు అఫీషియల్ ట్యాగ్ సెలక్టెడ్ అకౌంట్స్కే కాకుండా ఇతర వెరిఫైడ్ ప్రొఫైల్స్‌లోనూ కనిపించింది. ఇది మరింత గందరగోళాన్ని సృష్టిస్తుందనే ఉద్దేశంతో మస్క్ వెంటనే అఫీషియల్ లేబుల్‌ను అందరికీ తొలగించేశారు.
ఈ అఫీషియల్ ట్యాగ్ గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రధాన న్యూస్ మీడియా సంస్థల వంటి సెలెక్టెడ్ హ్యాండిల్స్‌లో మాత్రమే కనిపించాల్సి ఉంది కానీ అలా జరగలేదు. యూట్యూబర్స్‌కి కూడా ఈ ట్యాగ్ కనిపించింది. అమెరికన్ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ ట్విట్టర్ లేటెస్ట్ అప్డేట్ తర్వాత తన ప్రొఫైల్ పేజీలో ప్రొఫైల్ నేమ్ కింద అఫీషియల్ ట్యాగ్ కనిపించినట్లు ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ దానిని తాను కిల్ చేసినట్లు మస్క్ చెప్పారు. అంటే ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి నిలిపేసినట్లు క్లారిటీ ఇచ్చారు. "రాబోయే నెలల్లో ట్విటర్ చాలా తెలివి తక్కువ పనులను చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ఏవి వర్కవుట్ అయితే వాటిని మేం ఉంచుతాం. వర్కౌట్ కాని వాటిని మారుస్తాం." అని మరో ట్వీట్ ద్వారా మస్క్ చెప్పారు.
Explained: మెటా 11 వేల ఉద్యోగుల తొలగింపు ఎందుకు? ఇండియన్ వర్కర్స్ పరిస్థితి ఏంటి?
మరోవైపు ట్విట్టర్ సపోర్ట్ ప్రొఫైల్స్‌పై 'అఫీషియల్' ట్యాగ్ గురించి వివరణ ఇచ్చింది. ఒక ట్వీట్లో "మేం ప్రస్తుతం ప్రొఫైల్స్‌పై 'అఫీషియల్' లేబుల్‌ను ఉంచడం లేదు, కానీ మేం ట్విట్టర్ వేదికగా వంచన, మోసాలకు పాల్పడే వారిని సమర్థవంతంగా పట్టుకుంటున్నాం" అని పేర్కొంది. సెలెక్టెడ్ వెరిఫైడ్ అకౌంట్స్ కోసం అఫీషియల్ లేబుల్ బుధవారం కనిపించింది. మళ్లీ వెంటనే అది అదృశ్యమైంది. కొత్త ట్యాగ్ ఉన్న సెలెక్టెడ్ హ్యాండిల్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక హ్యాండిల్ కూడా ఉంది. దీనిని తొలగించిన తర్వాత మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ పవర్ తీసుకొస్తానని చెప్తూ వస్తున్న మస్క్ ట్విట్టర్లో బ్లూ చెక్ ఒక గొప్ప లెవలర్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ వీపీ Esther Crawford, ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్‌తో యూజర్ల అకౌంట్స్‌కి బ్లూ టిక్ వెరిఫికేషన్ లభిస్తుందని అన్నారు. కానీ అది వారి ఐడెంటిటీని వెరిఫై చేయదని స్పష్టం చేశారు. అఫీషియల్ లేబుల్ ద్వారా నిజమైన పబ్లిక్ ఫిగర్స్, గవర్నమెంట్ హ్యాండిల్స్, తదితర ప్రముఖుల అకౌంట్స్ గుర్తించొచ్చని పేర్కొన్నారు. ఈ అఫీషియల్ ట్యాగ్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండదన్నారు. కాగా ఈ ట్యాగ్ ఫీచర్ ఈరోజే లాంచ్ అయ్యింది కానీ కనిపించాల్సిన ప్రొఫైల్స్‌లో కాకుండా వేరే ప్రొఫైల్స్‌లో కూడా కనిపించింది. మళ్లీ దీన్ని వెనక్కి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. మస్క్ ఏం చేస్తున్నారో తనకైనా ఐడియా ఉందా అంటూ చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ విమర్శలకు మస్క్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.