Home /News /technology /

TWITTERS INSTAGRAM LIKE FEATURE LEAKS AGAIN THIS IS WHAT THE NEW DETAILS TELL GH VB

Twitter Flock: ట్విట్టర్​లో త్వరలోనే ఇన్​స్టాగ్రామ్​ తరహా ఫీచర్.. ట్విట్టర్​ ఫ్లాక్​ ఎలా పనిచేస్తుందంటే..?

ట్విట్టర్ లోగో

ట్విట్టర్ లోగో

ప్రముఖ మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్ మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ట్విట్టర్​ ఫ్లాక్​ పేరుతో కొత్త ఫీచర్​ను పరిచయం చేసే యోచనలో ఉంది. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు వారి నిర్దిష్ట ట్వీట్లను చూడగలిగే వ్యక్తుల జాబితాను ఎంచుకోవచ్చు.

ఇంకా చదవండి ...
ప్రముఖ మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్(Twitter) మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ట్విట్టర్​ ఫ్లాక్​ పేరుతో కొత్త ఫీచర్​ను(New Feature) పరిచయం చేసే యోచనలో ఉంది. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు వారి నిర్దిష్ట ట్వీట్లను చూడగలిగే వ్యక్తుల జాబితాను ఎంచుకోవచ్చు. అంటే, నిర్దిష్ట ట్వీట్లు ఎంపిక చేసిన ఫాలోవర్స్​కు మాత్రమే కనిపిస్తాయి. అంతే కానీ ఆయా ట్వీట్లు యూజర్లందరికీ కనిపించవు. ట్విట్టర్​ ఇన్‌పుట్ రిపోర్ట్​ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్‌తో సమానంగా ఈ కొత్త ఫీచర్‌ ఉండనుంది. గతేడాది జూలైలో డౌన్‌వోట్ వంటి అనేక ఇతర ఫీచర్లతో పాటే ఈ కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ టీజ్​ చేసింది.

తాజాగా రివర్స్ ఇంజనీర్ అలెశాండ్రో పలుజ్జీ ఇటీవల ట్విట్టర్ యాప్‌లో కొత్త ఫ్లాక్ ఫీచర్​కు సంబంధించిన కోడ్‌ను గుర్తించాడు. కోడ్ ఆధారంగా ఈ కొత్త ఫీచర్​ గురించి కొన్ని ఆసక్తికర వివరాలను పంచుకున్నాడు. ఈ ఫీచర్‌ను మొదట్లో 'ట్రస్టెడ్ ఫ్రెండ్స్' పేరుతో పిలిచింది. ఆ తర్వాత ఫీచర్​ పేరును 'ఫ్లాక్'గా మార్చింది.

Padma Awards: టోక్యో పారాలింపిక్స్​లో దుమ్మురేపే ప్రదర్శన.. ఫలితంగా అతనికి ​వరించిన పద్మశ్రీ..


గరిష్టంగా 150 మందితో గ్రూప్
ఫ్లాక్​ ఫీచర్​ ద్వారా ట్విట్టర్​ యూజర్లు తమ ఫాలోవర్స్​లో గరిష్టంగా 150 మందిని ఒక గ్రూప్​గా ఎంచుకోవచ్చు. దీన్ని ట్విట్టర్​ ఫ్లాక్​గా పేర్కొంటారు. ఈ గ్రూప్​తో మాత్రమే ట్వీట్లను షేర్​ చేసుకునే వీలుంటుంది. ఈ గ్రూప్​లో షేర్​ చేసిన ట్వీట్లను ఈ గ్రూప్​లోని సభ్యులు మాత్రమే చూడగలుగుతారు. అలాగే రిప్లై కూడా వారే ఇవ్వగలుగుతారని తెలుస్తోంది. ఈ ఫ్లాక్​ నుంచి ఎవరినైనా తొలగించినా సదరు సభ్యుడికి ఎటువంటి నోటిఫికేషన్​ లభించదని అలెజాండ్రో వివరించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ఫీచర్​ను ట్విట్టర్​ అందుబాటులోకి తీసుకురానుంది.

కాగా, ఫేస్​బుక్​ యాజమాన్యంలోని వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. గతేడాది జూలైలో ట్విట్టర్ ఈ ఫ్లా​క్​ ఫీచర్​ను టీజ్​ చేసినప్పటికీ.. ఆ తర్వాత దీనికి సంబంధించి ట్విట్టర్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఏదేమైనా ఈ ఫీచర్​ త్వరలోనే ట్విట్టర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఐఓఎస్​ యూజర్ల కోసం మరో ఫీచర్​..
ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ ఐఫోన్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్​ చేయడం ప్రారంభించింది. “కోట్ ట్వీట్ విత్ రియాక్షన్” అనే ఫీచర్​ను ప్రకటించింది. ఈ ఫీచర్​ ప్రకారం, కెమెరాను ఉపయోగించడం ద్వారా పోస్ట్‌ను రీట్వీట్ చేయవచ్చు. దానితో వారి స్వంత వీడియోను జోడించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను కంపెనీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
Published by:Veera Babu
First published:

Tags: Latest Technology, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు