హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Blue: ట్విటర్‌ నుంచి మరో సరికొత్త ఫీచర్‌.. అయితే ఫ్రీగా కాదు!

Twitter Blue: ట్విటర్‌ నుంచి మరో సరికొత్త ఫీచర్‌.. అయితే ఫ్రీగా కాదు!

ట్విటర్‌ నుంచి ‘ట్విటర్‌ బ్లూ’ పేరుతో ఓ పెయిడ్‌ సర్వీసు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే ఆ ఫీచర్లకు యూజర్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ట్విటర్‌ నుంచి ‘ట్విటర్‌ బ్లూ’ పేరుతో ఓ పెయిడ్‌ సర్వీసు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే ఆ ఫీచర్లకు యూజర్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ట్విటర్‌ నుంచి ‘ట్విటర్‌ బ్లూ’ పేరుతో ఓ పెయిడ్‌ సర్వీసు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే ఆ ఫీచర్లకు యూజర్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

  ట్విటర్‌ యూజర్లు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆప్షన్‌ ‘ఎడిట్‌ ట్వీట్‌’. ట్వీట్‌లో ఏదైనా తప్పుదొర్లితే సరిదిద్దుకోవడానికి ఈ ఆప్షన్‌ కావాలని చాలా రోజుల నుండి యూజర్లు అడుగుతూనే ఉన్నారు. అయితే ట్విటర్‌ నుండి ఈ విషయంలో ఎలాంటి స్పందన కాలేదు. అయితే ఇటీవల మాత్రం ‘అన్‌డూ ట్వీట్‌’ ఆప్షన్‌ను తీసుకొస్తోందని వార్తలొచ్చాయి. పోనీలే గుడ్డిలో మెల్ల అనుకుని యూజర్లు ఊరుకున్నారు. అయితే ఈ ఆప్షన్‌ విదేశాల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఫ్రీగా మాత్రం కాదు. ట్విటర్‌ నుండి ‘ట్విటర్‌ బ్లూ’ పేరుతో ఓ పెయిడ్‌ సర్వీసు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అంటే ఆ ఫీచర్లకు యూజర్‌ డబ్బులు చెల్లించాలన్నమాట. ట్విటర్‌ బ్లూ ఫీచర్‌ను ఇటీవల కెనడా, ఆస్ట్రేలియా లాంచ్‌ చేశారు. తొలి నెల రోజులు ఈ సర్వీసులు ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత నెలకు కెనడాలో అయితే 3.49 డాలర్లు, ఆస్ట్రేలియాలో అయితే 4.49 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

  WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

  ట్విటర్‌ బ్లూ ఫీచర్లేంటంటే...

  ట్విటర్‌ బ్లూ సర్వీసును కొనుగోలు చేస్తే మీ ట్విటర్‌లో ఈ మార్పులు కనిపిస్తాయి.

  -విషయం మొత్తం రాసి... ట్వీట్‌ కొట్టాక 30 సెకన్లపాటు అన్‌డూ ట్వీట్‌ అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ట్వీట్‌ పోస్ట్‌ అవ్వదు.

  -కొత్తగా బుక్‌మార్క్‌ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. దీని ద్వారా సేవ్‌ చేసుకున్న ట్వీట్లను సెక్షన్ల వారీగా విడగొట్టి తర్వాత అవసరమైన చూసుకోవచ్చు.

  -వరుస ట్వీటు చేసేవారికి ఉపయోగకంగా కొన్ని రోజుల క్రితం థ్రెడ్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. అయతే అన్ని ట్వీట్లను ఒకసారి చదవడం అంత సులభం కాదు. ట్విటర్‌ బ్లూ అవన్నీ ఒకేద దగ్గర చదివేలా కన్సాలిడేటెడ్‌ టెక్స్ట్‌ ఫీచర్‌ ఇస్తున్నారు.

  -ఈ ఫీచర్‌ ద్వారా ట్విటర్‌ ఐకాన్‌ను కూడా మార్చుకోవచ్చు. అలాగే యాప్‌ లోపల లుక్‌ను కూడా ఛేంజ్‌ చేసుకోవచ్చు.

  -ఇవి కాకుండా మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ట్విటర్‌ సన్నాహాలు చేస్తోంది. అందులో వార్తలు ఒకటి. దీని కోసం ట్విటర్‌ ఇప్పటికే స్క్రోల్‌ లాంటి సంస్థతో టై అప్‌ అయ్యింది. వాతావరణ సమాచారం అందించడానికి టుమారో అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో రెవూ అనే మీడియా సంస్థతో కూడా చేతులు కలిపింది.

  అసలెందుకు సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చారంటే..

  ట్విటర్‌ గత 15 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే యాడ్స్‌ ద్వారా డబ్బులు సంపాదిస్తోంది. గత కొద్ది రోజులుగా యాడ్స్‌ వల్ల పెద్దగా డబ్బులు రావడం లేదట. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌కు వెళ్లడం వల్ల లాభం ఉంటుందని ట్విటర్‌ భావించింది. అందుకే కొన్నాళ్లుగా దీనిపై వర్క్‌ చేసి ఇటీవల విదేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుగా ట్విటర్‌ బ్లూను లాంచ్‌ చేసింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను లైవ్‌లోకి తీసుకొస్తారట.

  First published:

  Tags: Twitter

  ఉత్తమ కథలు