Twitter: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ప్రముఖ మైక్కో బ్లాగింగ్ ప్లాట్ఫారం ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు నుంచి తన నిర్ణయాలతో, వ్యవహార శైలితో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. చివరికి ట్విట్టర్‌ని షట్‌డౌన్ చేస్తున్నట్లు కూడా న్యూస్ ట్రెండ్ అయింది. ఇప్పుడు మరో వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు ఎలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఐవోఎస్ ప్లాట్ఫారంలో ట్విట్టర్ ఉపయోగించేవారికి వెరిఫికేషన్ టిక్స్ ధరను పెంచేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* మళ్లీ తెరపైకి వెరిఫికేషన్ టిక్స్
అక్టోబర్ నెలలో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ బ్లూటిక్ కోసం 8 డాలర్ల చెల్లించాలని ప్రకటించారు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. పెద్ద ఎత్తు ఫేక్ అకౌంట్లు క్రియేట్ కావడం, బ్లూటిక్‌ను దుర్వినియోగం చేయడంతో ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. అనంతరం సెలబ్రిటీలు, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుకు వివిధ రంగులతో కూడిన ప్రత్యేక వెరిఫికేషన్ టిక్స్‌ను అందిస్తామని తెలిపారు. ఇప్పుడు ట్విట్టర్ వినియోగించే యాపిల్ ఫోన్ యూజర్లు(iPhone Users) బ్లూటిక్ సబ్స్క్రిప్షన్(BlueTick Subscription) కోసం రూ.900 చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు. వెబ్సైట్ యూజర్లు అయితే రూ.570 చెల్లించాలని స్పష్టం చేశారు.
* యాపిల్ కంపెనీ తీరుకు వ్యతిరేకంగా నిర్ణయం
ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్‌ల ద్వారా చేసే పేమెంట్స్‌పై యాపిల్ కంపెనీ 30% కోత విధించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఎలాన్ మస్క్ తాజా నిర్ణయాలు ఉన్నాయిన కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. వెబ్సైట్ ద్వారా పేమెంట్స్ చేసేవారికి తక్కువ ధర విధించటం కూడా అందులో భాగమేనని చెబుతున్నారు. ఐఫోన్ యూజర్లను తగ్గించడం ఒక కారణంగా చూపిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారంలకు ఎటువంటి ధర మార్పులను ఎలాన్ మస్క్ ప్రకటించలేదు.
* గో టూ వార్
గతవారం మాస్క్ తన ట్విట్టర్ అకౌంట్లో యాపిల్ కంపెనీకి సంబంధించిన పలు ట్వీట్లను పోస్ట్ చేశారు. అందులో ఐఫోన్ ద్వారా వినియోగదారులు చేసే పేమెంట్స్‌పై 30% కోతకు సంబంధించిన ట్వీట్ కూడా ఉంది. యాపిల్‌కు కమీషన్ చెల్లించే బదులు యాపిల్ కంపెనీపై యుద్ధానికి వెళ్తానని "గో టూ వార్"అనే మీమ్ కూడా పోస్ట్ చేశారు. అనంతరం యాపిల్ హెడ్‌క్వార్డర్స్‌లో కంపెనీ సీఈవో టీం కుక్‌తో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. తర్వాత యాప్‌స్టోర్ నుంచి ట్విట్టర్ యాప్ తొలగించడంపై ఉన్న వివాదం పరిష్కారమైందని ట్వీట్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.