Twitter Voice DMs: ట్విట్టర్ యూజర్లకు శుభవార్త.. అందుబాటులోకి మరో సరికొత్త ఫీచర్.. తెలుసుకోండి..

ట్విట్టర్ లోగో

ట్విట్టర్ యూజర్లకు ఒక శుభవార్త. ఆ సంస్థ తాజాగా వాయిస్ మెస్సేజింగ్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వాయిస్ డైరెక్ట్ మెస్సేజింగ్ ఫీచర్‌ను యూజర్లు వాడుకోవచ్చు.

  • Share this:
ట్విట్టర్ యూజర్లకు ఒక శుభవార్త. ఆ సంస్థ తాజాగా వాయిస్ మెస్సేజింగ్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వాయిస్ డైరెక్ట్ మెస్సేజింగ్ ఫీచర్‌ను యూజర్లు వాడుకోవచ్చు. ఫిబ్రవరి 17 నుంచి భారత్, బ్రెజిల్, జపాన్ దేశాల్లోని వినియోగదారులకు ఈ ఫీచర్‌ను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానుంది. ఆ సంస్థ గత సంవత్సరం ప్రవేశపెట్టిన వాయిస్ ట్వీట్ల తరహాలోనే ఇప్పుడు వాయిస్ DM గా మెసేజ్ లను ఆడియో రూపంలో పంపవచ్చు. వాయిస్ ట్వీట్ల మాదిరిగానే ప్రతి వాయిస్ DMలో అత్యధికంగా 140 సెకండ్ల వరకు వాయిస్ మెసేజ్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ టెస్ట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ వాయిస్ DMను పంపడం కూడా సులువే.. ట్విట్టర్ DMలలో ఇప్పటికే ఉన్న కన్వర్జేషన్‌ను ఓపెన్ చేసి వాయిస్ మెసేజ్ చేసుకోవచ్చు.

కొత్త అకౌంట్‌ కోసం చాట్ లిస్ట్‌ ఓపెన్ చేయాలి. మెసేజ్ రికార్డ్ చేయడానికి చాట్ లిస్ట్‌లో వాయిస్ రికార్డింగ్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. వాయిస్ మెసేజ్ పూర్తయ్యాక రెండోసారి క్లిక్ చేయాలి. రికార్డు చేసిన వాయిస్‌ను పంపడానికి ముందు వినే సదుపాయం కూడా ఉంది. iOS వినియోగదారులు మెసేజ్ రికార్డ్ చేయడానికి వాయిస్ రికార్డింగ్ ఐకాన్‌ను ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. మాట్లాడటం పూర్తయిన తరువాత వాయిస్ మెసేజ్ ను నేరుగా పంపడానికి పైకి స్వైప్ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

ట్విట్టర్లో వాయిస్ DM ని ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. వెబ్ బ్రౌజర్‌లో ఈ ఫీచర్ కోసం మరికొన్ని రోజులు సమయం పట్టవచ్చు. కానీ వినియోగదారులు వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా రిసీవ్ చేసుకున్న వాయిస్ మెసేజ్ లను వినవచ్చు. ఈ సందర్భంగా కస్టమర్లకు కొత్త రకం సేవలందించేందుకు ట్విట్టర్ ఎప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ పేర్కొంది.

కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి వెల్లడించారు. భారతదేశం ట్విట్టర్‌కు ఒక ప్రధాన మార్కెట్‌గా ఉందని చెప్పారు. అందుకే భారత్‌లో కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామన్నారు. ఇక్కడి ప్రజల అనుభవాల నుంచి కొత్త సేవలకు రూపకల్పన చేస్తామన్నారు. DM వాయిస్ మెసేజ్ ప్రయోగం ద్వారా ప్రజలు కొత్త అనుభూతితో ఇతరులతో కనెక్ట్ కావచ్చని చెప్పారు. ట్విట్టర్ గత ఏడాది జూన్‌లో వాయిస్ ట్వీట్స్‌ని ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫాంపై ఆడియో మెసేజ్ లకు మొదటిసారి మార్గం కల్పించింది. టెక్ట్స్‌తో సంబంధం లేకుండా.. వాయిస్ నోట్స్‌ను ట్వీట్‌లుగా పంపేందుకు ఈ ఫీచర్‌ అవకాశం కల్పించింది. దీనికి కొనసాగింపుగా వాయిస్ మెసేజ్ ను ట్విట్టర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Published by:Nikhil Kumar S
First published: