TWITTER USERS ARE COMPLAINING ABOUT LOSING FOLLOWERS SUDDENLY WHAT HAPPENING IN TWITTER GH SK
Twitter Followers: ట్విట్టర్లో ఏం జరుగుతోంది? ఫాలోవర్లు గయాబ్.. కొత్త సీఈవోకు కూడా షాక్
ప్రతీకాత్మక చిత్రం
Twitter: షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్లో కొత్త సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తమ ఫాలోవర్ల సంఖ్య అమాంతం తగ్గుతోందని చాలా మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో వందలాది మంది ఫాలోవర్లను కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ (Twitter) కొత్త సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తమ ఫాలోవర్ల సంఖ్య అమాంతం తగ్గుతోందని చాలా మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో వందలాది మంది ఫాలోవర్లను కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇలా అకస్మాత్తుగా భారీ సంఖ్యలో ఫాలోవర్లు తగ్గడానికి కారణాన్ని చెప్పాలని ట్విట్టర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై ట్విట్టర్ అధికారికంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ బాట్స్, ఇన్ యాక్టివ్ అకౌంట్లను క్లియర్ చేసేందుకు ఈ ప్లాట్ ఫాంలో డ్రైవ్స్‌ను క్లీన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు, స్పామ్ ఫైల్స్ (Spam Files) ను డిలీట్ చేయడానికి అప్పుడప్పుడు ట్విట్టర్ ఇలాంటి క్లీన్- అప్ డ్రైవ్స్ (Cleanup drives) నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలోనూ తమ ప్లాట్‌ఫాంను క్లీన్ చేసేందుకు ట్విట్టర్ ఇలాంటి కసరత్తునే నిర్వహించింది. "మీరు ఎప్పటికప్పుడు ఫాలోవర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. మేము పాస్వర్డ్ లేదా ఫోన్ నెంబర్ ను నిర్ధారించమని అడిగిన ఖాతాలు ఇంకా స్పందించలేదు. వారు ఆ సమాచారాన్ని ధ్రువీకరించే వరకు ఫాలోవర్ల కౌంట్‌లో తగ్గుదల కనిపించవచ్చు. స్పామ్‌ను నిరోధించడానికి, ఖాతాలన్నింటినీ సురక్షితంగా ఉంచడానికి ఈ విధానాన్ని అవలంభిస్తున్నాం" అని ట్విట్టర్ అప్పట్లో ప్రకటించింది.
* కొత్త సీఈఓకూ తగ్గిన ఫాలోవర్లు..
ఫాలోవర్లను భారీగా కోల్పోయిన బాధితుల్లో ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. ఆయన అకౌంట్ లో కూడా గణనీయంగా ఫాలోవర్లు తగ్గారు. పరాగ్ కు ట్విట్టర్లో 3 లక్షల 60వేలకు పైగా అనుచరులుండగా.. గురువారం(డిసెంబరు 2) నాటికి వేల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం ఆయన ఖాతాలో 43 వేలమంది అనుచరులు మాత్రమే ఉన్నారు. ఈ సమస్యపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. #Followerspehamla హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఇటీవలే ట్విట్టర్ నిబంధనలను కఠినతరం చేసింది. వ్యక్తుల అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయడానికి అనుతించబోమని ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. ఇంటి చిరునామా, వ్యక్తిగత సమాచారం ఇతర సున్నితమైన డేటాను బహిర్గతం చేసే మీడియా ఫైల్స్ ను సైతం సంస్థ నిషేధించింది. అయితే ఈ నిబంధనలను తీసుకొచ్చిన మరుసటి రోజే ట్విట్టర్ కొత్త సీఈఓగా అగర్వాల్ ను ప్రకటించడం గమనార్హం.
ఐఐటీ బాంబే (IIT Bombay) నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన పరాగ్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు. 2011లో ట్విట్టర్ చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్, యాహూ లాంటి సంస్థల్లో పనిచేశారు. పదేళ్ల నుంటి మైక్రోబ్లాగింగ్ సైట్ పలు కీలక పదవుల్లో కొనసాగారు. పరాగ్ ప్రణాళికల కారణంగా 2016, 2017లో కొత్త ట్విట్టర్ యూజర్ల చేరిక వేగవంతమైంది. 2018 అక్టోబర్‌లో పరాగ్ ట్విట్టర్ సీటీఓ (CTO)గా నియమితులయ్యారు. కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని మార్పులకు సంస్థ శ్రీకారం చుట్టింది. దీంతో పరాగ్ నేతృత్వంలో ట్విట్టర్లో మరిన్ని మార్పులు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.