హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Blue Tick: రేపటి నుంచే ట్విట్టర్ బ్లూ టిక్ సబ్క్రిప్షన్ సేవలు.. ఛార్జీలు ఎంతంటే?

Twitter Blue Tick: రేపటి నుంచే ట్విట్టర్ బ్లూ టిక్ సబ్క్రిప్షన్ సేవలు.. ఛార్జీలు ఎంతంటే?

6. అయితే అఫీషియల్ లేబుల్‌తో ఈ సమస్యకు ట్విట్టర్ చెక్ పెట్టనుంది. ఈ లేబుల్‌ను పొందే ఖాతాలలో ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార భాగస్వాములు, ప్రధాన మీడియా సంస్థలు, ప్రచురణకర్తలు, మరికొందరు పబ్లిక్ ఫిగర్స్‌ ఉంటారని క్రాఫోర్డ్ ట్వీట్ చేశారు. కాగా గతంలో బ్లూ చెక్ మార్క్‌తో వెరిఫికేషన్ పొందిన అన్ని ట్విట్టర్ అకౌంట్స్‌కి "అఫీషియల్" లేబుల్‌ను అందించమని, అది కొనుగోలుకు కూడా అందుబాటులో ఉండదని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి తన 'బ్లూ టిక్' సేవను ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. నెల క్రితమే కంపెనీ ఈ సేవను ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. అది విఫలమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) మరోసారి తన 'బ్లూ టిక్' (Blue Tick) సేవను ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. నెల క్రితమే కంపెనీ ఈ సేవను ప్రారంభించాలని ప్లాన్ చేసినా.. అది విఫలమైంది. సోమవారం నుంచి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నట్లు సోషల్ మీడియా సంస్థ శనివారం తెలిపింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ సేవలను పొందిన వారు వారు బ్లూ వెరిఫైడ్ ఖాతాతో పాటు ప్రత్యేక ఫీచర్లను పొందవచ్చు.

బ్లూ టిక్ ఎవరు పొందుతారు?

బ్లూ మార్క్‌లు ప్రాథమికంగా ట్విట్టర్ ద్వారా ధృవీకరించబడిన కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు మరియు జర్నలిస్టులకు ఇచ్చేది. అక్టోబర్‌లో ట్విటర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ (Elon Musk) ఎవరికైనా నెలకు $8 రుసుముతో బ్లూ టిక్‌లను అందించే సేవను ప్రారంభించాడు. అయితే కొంతమంది నకిలీ వినియోగదారులు ట్విట్టర్ బ్లూ టిక్‌లను కూడా అందుకున్నారు. దీని కారణంగా ట్విట్టర్ ఈ సేవను నిలిపివేసింది. నవంబర్ 29న సైతం ట్విట్టర్ బ్లూ టిక్ సేవలను ప్రారంభించాలని ప్రయత్నించి మరో సారి వెనక్కు తగ్గింది.

WhatsApp: వాట్సాప్ విండోస్ వెర్షన్‌​లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్​.. మీకు మీరే మెసేజ్​లు పంపుకునే అవకాశం

ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది?

ఇప్పుడు పునఃప్రారంభించబడిన సేవ వెబ్ వినియోగదారులకు నెలకు $8 మరియు iPhone వినియోగదారులకు నెలకు $11 ఖర్చు అవుతుంది. ఈ సేవలు ఎంచుకున్న చందాదారులు తక్కువ ప్రకటనలను చూస్తారని, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయగలరని మరియు వారి ట్వీట్లు మరింత ప్రముఖంగా ప్రదర్శించబడతాయని ట్విట్టర్ తెలిపింది.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు