హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Edit Button: ట్విట్టర్ ట్వీట్ ఎడిట్ ఫీచర్‌ లాంచ్.. ఇండియన్స్‌కు మాత్రం ఇప్పట్లో రాదు.. ఎందుకంటే..

Twitter Edit Button: ట్విట్టర్ ట్వీట్ ఎడిట్ ఫీచర్‌ లాంచ్.. ఇండియన్స్‌కు మాత్రం ఇప్పట్లో రాదు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎట్టకేలకు "ఎడిట్ ట్వీట్ (Edit Tweet)" అనే ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం కోసం కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎట్టకేలకు "ఎడిట్ ట్వీట్ (Edit Tweet)" అనే ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం కోసం కొంతమంది సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చింది. టెస్టింగ్ పూర్తయ్యాక ట్విట్టర్ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి ఈ ఫీచర్ అందుబాటులోకి తేనుంది. అయితే ఇది లాంచ్‌ అయిన ప్రారంభ రోజుల్లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లందరికీ రిలీజ్ అవ్వదు. మొదటగా న్యూజిలాండ్‌లోని సబ్‌స్క్రైబర్లకు ఈ సరికొత్త ఫీచర్ లాంచ్ అవుతుంది. దీనిని యూజర్లు ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకున్న తర్వాతనే ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్‌లోని ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సర్వీస్ భారతీయులకు అందుబాటులో లేదు కాబట్టి ఈ ఎడిట్ ట్వీట్ ఫీచర్‌ను ఇప్పట్లో ఇండియన్ యూజర్లు ఎక్స్‌పీరియన్స్ చేయలేరు.

అరగంటలో ఐదు సార్లు

ట్విట్టర్ ట్వీట్లను ఎన్ని సార్లు ఎడిట్ చేసుకోవచ్చో తాజాగా వెల్లడించింది. యూజర్లు తమ ట్వీట్లను పోస్ట్ చేసిన 30 నిమిషాల లోగా ఎడిట్ చేసుకోవచ్చని ట్విట్టర్ పేర్కొంది. అయితే ఈ వ్యవధిలో యూజర్లు తమ ట్వీట్లను ఐదు సార్లు మాత్రమే ఎడిట్ చేయడం సాధ్యమవుతుంది. ఈ సమయంలో అక్షరదోషాలను సరి చేసుకోవచ్చు. మీడియా ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ట్యాగ్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తమకు కావాల్సినట్టుగా ట్వీట్‌ను మార్చుకోవచ్చు. ప్రతి సెకన్‌కు ట్వీట్‌లోని కంటెంట్‌ను మార్చేసి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయకుండా కంపెనీ ఈ లిమిట్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇండియన్ యూజర్లకు ఎందుకు రాదు?

ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సర్వీస్ భారతీయ యూజర్లకు అందుబాటులో లేదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ పెయిడ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఎడిట్ బటన్ మొదటగా ఈ వెర్షన్‌లోనే లాంచ్ కానుందని కంపెనీ చెబుతోంది. ఆ తర్వాత ఈ ఫీచర్‌ను యూజర్లు ఎలా ఉపయోగిస్తున్నారు అనేదానిపై విచారణ ఒక అంచనా వేస్తుంది. అనంతరం దీనిని ఫ్రీ లేదా రెగ్యులర్ యూజర్లకు అందించవచ్చు. అప్పటివరకూ ఈ బటన్‌ను ఇండియన్ యూజర్లు పొందలేరని తెలుస్తోంది. ఒకవేళ ట్విట్టర్ బ్లూ సేవలు ఇండియాలో త్వరగా అందుబాటులోకి వస్తే ఎడిట్ ఫీచర్ పొందడం సాధ్యమవుతుంది.

అందరికీ కనిపించే ట్వీట్ ఎడిట్ హిస్టరీ

ట్వీట్ ఎడిట్ హిస్టరీ పబ్లిక్‌గా కనిపిస్తుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతి ఎడిటెడ్ ట్వీట్‌లో లేబుల్, టైమ్‌స్టాంప్, ఐకాన్ కనిపిస్తాయి. దీనివల్ల ఒరిజినల్ ట్వీట్ ఎడిట్ చేశారా లేదా అనేది పబ్లిక్‌కి స్పష్టంగా తెలుస్తుంది. యూజర్లు లేబుల్‌ను నొక్కడం ద్వారా ట్వీట్ ఎడిట్ హిస్టరీ మొత్తం వ్యూ చేయవచ్చు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Twitter

ఉత్తమ కథలు