ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) అదిరిపోయే ఫీచర్లతో (Features) తన వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా తన ప్లాట్‌ఫాం ద్వారా పేమెంట్ యాక్సెప్ట్, పేమెంట్ సెండ్ (Payments) చేసేందుకు వీలుగా ఓ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. టిప్స్ (TIPS) అని పిలిచే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ (Android) యూజర్లందరికీ రోల్అవుట్ చేస్తున్నట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. బిట్‌కాయిన్ (BitCoin) లేదా క్యాష్ సెండ్ చేయడానికి ఈ టిప్స్ ఫీచర్ 18 ఏళ్ల నిండిన ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. టిప్స్ ఫీచర్ ఉపయోగమేమిటంటే.. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే.. మీ ఫాలోవర్లు మీకు టిప్స్ రూపంలో క్యాష్ అందించొచ్చు. ఒకవేళ మీరే ఫాలోవర్ అయితే కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ ద్వారా క్యాష్ సెండ్ చేయొచ్చు.
గతంలో ఇది పరిమిత ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అవైలబుల్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో క్రిప్టోకరెన్సీల రూపంలోని కరెన్సీ చెల్లింపులను కూడా యూజర్లు అంగీకరించవచ్చు. ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలోని ఎడిట్ ప్రొఫైల్ లో ‘టిప్స్’ ఫీచర్ ఆన్ చేస్తే.. టిప్స్ ఐకాన్.. ఫాలో బటన్ పక్కన వచ్చి చేరుతుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ సేవలు ఆస్వాదించవచ్చు. యూజర్లు వారి పేమెంట్స్ ప్రొఫైల్‌లను లింక్ చేయడానికి టిప్స్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. బాండ్ క్యాంప్(Bandcamp), క్యాష్ యాప్, చిప్పర్(Chipper), పట్రేన్(Patreon), రేజర్ పే(Razorpay), వెల్త్ సింపుల్ క్యాష్ (Wealth simple Cash) వెన్మో(Venmo) వంటి పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. మీరు సంపాదించిన టిప్స్ నుంచి ట్విట్టర్ ఎలాంటి కమీషన్ తీసుకోదు.
స్ట్రైక్ (Strike)ని ఉపయోగించి యూజర్లు బిట్‌కాయిన్‌తో కూడా టిప్ సెండ్ చేయవచ్చు. స్ట్రైక్ ప్రపంచవ్యాప్తంగా తక్షణ, ఉచిత పేమెంట్స్ సర్వీస్ అందిస్తుంది. ఇది ఎల్ సాల్వడార్, యూఎస్ (హవాయి, న్యూయార్క్ మినహా) ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా స్ట్రైక్ ఖాతాకు టిప్స్ పంపడానికి ఏదైనా బిట్‌కాయిన్ లైట్నింగ్ వాలెట్ ఉపయోగించవచ్చు.
* ట్విట్టర్లో టిప్స్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసి డబ్బు సంపాదించడింలా..
- ట్విట్టర్ ప్రొఫైల్ లోకి వెళ్లండి.
- ఎడిట్ ప్రొఫైల్(Edit Profile) పై క్లిక్ చేయండి.
- కాస్త కిందికి స్క్రోల్ చేసి 'Tips' అనే ఆప్షన్ పై నొక్కండి. జనరల్ టిప్పింగ్ పాలసీని యాక్సెప్ట్ చేయండి.
- 'ఎలౌ టిప్స్(Allow Tips)' టోగుల్ ఆన్ చేయండి. ఆపై క్యాష్ యాప్, రేజర్ పే ఇలా వరుసగా ఓ లిస్టులో కనిపించే థర్డ్ పార్టీ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు/సర్వీసెస్‌లో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోండి.
- మీ థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ యూజర్ నేమ్ ను నమోదు చేయండి. మీ ట్విట్టర్ ప్రొఫైల్‌లో టిప్స్ ఐకాన్ కనిపించాలంటే మీరు కనీసం ఒక యూజర్ పేరును నమోదు చేయాలి.
Airtel Tariff Hike: ఎయిర్టెల్ యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు
* ట్విట్టర్లో ఎలా టిప్ ఇవ్వాలి?
మీరు ట్విట్టర్లో మీకు నచ్చిన వ్యక్తులకు టిప్ ఇవ్వడానికి.. ప్రొఫైల్‌లో టిప్స్ ఐకాన్ యాక్టివేట్ చేయాలి. తరువాత టిప్స్ ఐకాన్ పై నొక్కాలి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న థర్డ్-పార్టీ పేమెంట్ సర్వీస్ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్తారు. ఆపై మీరు టిప్ ఇవ్వాలనుకున్న మొత్తాన్ని ఎంచుకుని, టిప్ సెండ్ చేయవచ్చు.
“మీరు స్ట్రైక్ ద్వారా బిట్‌కాయిన్‌ని పంపినప్పుడు, మీరు సతోషి (సాట్స్) లేదా BTCలో కరెన్సీని చూడగలరు. అలాగే, మీరు ఎవరి బిట్‌కాయిన్ చిరునామాను కాపీ చేసి, మీరు ఉపయోగించే బిట్‌కాయిన్ వాలెట్లో వారి చిరునామాను కూడా పేస్ట్ చేయగలరు." అని ట్విట్టర్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.