నెటిజన్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్... ప్రపంచవ్యాప్తంగా గంటపాటూ షట్‌డౌన్...

Twitter Crash : సోషల్ మీడియాలో టాప్ టెన్ యాప్స్‌లో ట్విట్టర్ స్థానం ఎప్పుడూ టాప్ ఫైవ్ లోనే ఉంటోంది. దాదాపు సెలబ్రిటీలంతా ట్విట్టర్ వాడుతున్నారు. మరి ఆ సైట్ క్రాష్ ఎందుకైంది? అసలేం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 5:36 AM IST
నెటిజన్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్... ప్రపంచవ్యాప్తంగా గంటపాటూ షట్‌డౌన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Twitter Outage : గురువారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ యూజర్లు... దాదాపు గంటపాటూ ఆ వెబ్‌సైట్‌ను రన్ చేయలేకపోయారు. పీసీలు, మొబైళ్లు అన్నింటా అదే పరిస్థితి తలెత్తింది. ట్విట్టర్ ఓపెన్ చెయ్యగానే... సంథింగ్ టెక్నికల్ రాంగ్ అంటూ మెసేజ్ కనిపించింది. దాన్ని గుర్తించామన్న ట్విట్టర్ మేనేజ్‌మెంట్ త్వరలోనే దాన్ని సెట్ చేస్తామని చెప్పింది. ట్విట్టర్ యాప్‌లో ట్వీట్లు అప్‌లోడ్ కావట్లేదనే మెసేజ్ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ట్విట్టరేంటి... ఆగిపోవడమేంటి అని అనుకున్నారు. అమెరికా, యూరప్‌లో యూజర్లు ఎక్కువ ఇబ్బందులు పడ్డారని తెలిసింది. దాదాపు గంట తర్వాత సమస్య కొలిక్కి రావడంతో... ట్విట్టర్ మళ్లీ పనిచేసింది. ఆ తర్వాత ట్విట్టర్ పనిచేస్తోందన్న మెసేజ్ పెట్టిన యాజమాన్యం... త్వరలోనే ట్విట్టర్‌ను అందరూ వాడుకునేలా చేస్తామని తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు ట్విట్టర్ అందరికీ పనిచేస్తోంది.

అసలేం జరిగింది : అంతర్గతంగా సిస్టం ఛేంజ్ అవ్వడం వల్ల టెక్నికల్ సమస్య తలెత్తిందని ట్విట్టర్ తెలిపింది. జరిగిన పొరపాటుకు క్షమించండి అని నెటిజన్లను కోరింది. ఇప్పుడు వంద శాతం పర్ఫెక్టుగా ట్విట్టర్ పనిచేస్తోందని వివరించింది. టెక్నాలజీ అన్నాక, కొన్ని కోట్ల మంది అకౌంట్లు ఉన్నప్పుడు... అప్పుడప్పుడూ ఇలాంటి సమస్యలు కామనే అంటున్నారు నిపుణులు.

జులై 3న ఇలాగే ఇన్‌స్టాగ్రామ్ పనిచెయ్యలేదు. అదే సమయంలో ఫేస్‌బుక్, వాట్సాప్ కూడా పనిచేయకపోవడంతో... ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైట్లలో ఫొటోలు, వీడియోలూ సరిగా షేరింగ్ కాలేదు. దాదాపు రోజంతా ఇదే పరిస్థితి తలెత్తింది. జూన్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ రెండు గంటలపాటూ పనిచేయలేదు. తరచూ తలెత్తుతున్న ఇలాంటి టెక్నికల్ సమస్యలు... నెటిజన్లను ఇబ్బంది పెడుతున్నాయి.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>