ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పులు చేపడుతున్నారు. అలాగే మస్క్ అత్యంత కీలకమైన ఫీచర్లను పెయిడ్ ఫీచర్లుగా మార్చి, ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే ట్విట్టర్ తాజాగా మరో సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రీమియం ఫీచర్‌గా మార్చేసింది. మార్చి 20 నుంచి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి తప్ప, మిగతా వారందరికీ SMS-బేస్డ్ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను (Two-factor authentication) ట్విట్టర్ ఆపేసింది.
ఇప్పుడు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని పక్షంలో.. మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సిందే. ఇండియాలో మొబైల్ యూజర్లకు ట్విట్టర్ బ్లూ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఏకంగా రూ.900గా నిర్ణయించారు. నెలకు ఇంత డబ్బు పెట్టి దీన్ని తీసుకోవడం చాలా మంది యూజర్లకు భారమేనని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో కీలకమైన ప్రైవసీ ఫీచర్లను సైతం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో భాగం చేయడం యూజర్లకు నచ్చట్లేదు.
అయితే థర్డ్ పార్టీ యాప్స్‌తోనూ ట్విట్టర్ అకౌంట్‌ను సేఫ్టీగా ఉంచుకోవచ్చు. మరి ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఏవి, వాటిని ఉపయోగించి సెక్యూరిటీని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
SMS బేస్డ్ 2FA అనేది ట్విట్టర్‌కి లాగిన్ చేసినప్పుడు మీ ఫోన్‌కి కోడ్‌ని పంపే సెక్యూరిటీ ఫీచర్. ఇకపై ఈ సెక్యూరిటీ ఫీచర్ సాధారణ యుజర్లకు అందుబాటులో ఉండదు కాబట్టి వారు తమ అకౌంట్‌కు 2FA సెక్యూరిటీని కొనసాగించడానికి వేరే అథెంటికేటర్ యాప్ వినియోగించొచ్చు. వాస్తవానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) కోసం ట్విట్టర్ SMS బేస్ట్ పద్ధతి కాకుండా సెక్యూరిటీ కీ, అథెంటికేటర్ యాప్ అనే మరో రెండు పద్ధతులను అందిస్తుంది. ట్విట్టర్ సాధారణ యూజర్లు ఈ పద్ధతుల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు.
* సింపుల్ మెథడ్స్‌లో ట్విట్టర్ అకౌంట్‌కి 2FA సెక్యూరిటీ
స్టెప్ 1: ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి, మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: "సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ" సెలక్ట్ చేసి.. తర్వాత "సెక్యూరిటీ అండ్ అకౌంట్ యాక్సెస్" ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీంట్లో కనిపించే "సెక్యూరిటీ"పై క్లిక్ చేయాలి. అక్కడ "Two-factor authentication" సెలక్ట్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి : ఇండియాలో 45,000 AI ఉద్యోగాలు .. రూ.45 లక్షల వరకు జీతం!
స్టెప్ 3: అనంతరం స్క్రీన్‌పై కనిపించే "సెక్యూరిటీ కీ", "అథెంటికేషన్ యాప్" ఆప్షన్లలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే "టెక్స్ట్ మెసేజ్" అనే మెథడ్ కూడా కనిపిస్తుంది కానీ అది ఓన్లీ ప్రీమియం యూజర్లకే అందుబాటులో ఉంటుంది.
స్టెప్ 4: అథెంటికేషన్ యాప్ సెలెక్ట్ చేసుకుని ఉంటే.. Google Authenticator లేదా 1Password వంటి అథెంటికేషన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. "గెట్ స్టార్టడ్"ని ఎంచుకున్న తర్వాత, "లింక్ యాప్"పై క్లిక్ చేయాలి. తరువాత స్క్రీన్‌పై కనిపిస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎక్స్‌ట్రా సెక్యూరిటీని జత చేయవచ్చు.
స్టెప్ 5: "సెక్యూరిటీ కీ"ని సెలెక్ట్ చేసుకుని Twitterకి లాగిన్ చేయడానికి ఫిజికల్ కీని పొందవచ్చు. ఈ పద్ధతిలో కూడా అకౌంట్‌కు ఎక్స్‌ట్రా సెక్యూరిటీని జత చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.