TWITTER SPACES HOW TO RECORD AND LISTEN LATER A STEP BY STEP GUIDE GH VB
Twitter Spaces: ట్విట్టర్లో కొత్త ఫీచర్.. స్పేసెస్‌ను రికార్డ్ చేసుకొని వినే అవకాశం.. ఎలాగంటే..?
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో అత్యంత పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోన్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter) మరో కొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది. తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చడానికి గతేడాది ‘ట్విట్టర్ స్పేసెస్’ అనే ఆడియో గ్రూప్ చాట్ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలో అత్యంత పాపులర్ సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోన్న మైక్రో బ్లాగింగ్ (Micro Blogging) సైట్ ట్విట్టర్(Twitter) మరో కొత్త ఫీచర్(Feature) తో ముందుకొచ్చింది. తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చడానికి గతేడాది ‘ట్విట్టర్ స్పేసెస్(Twitter Spaces)’ అనే ఆడియో గ్రూప్ చాట్ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఆన్లైన్లో(Online) ఆడియో చర్చలు చేయవచ్చు. ఇది అచ్చం క్లబ్ హౌస్ ఆడియో చాట్ ఫీచర్(Audio Chat Feature) వలే పనిచేస్తుంది. అయితే దీనిలో చర్చలను రికార్డింగ్ చేసుకునేందుకు ఇప్పటివరకు ట్విట్టర్ ఆప్షన్ ఇవ్వలేదు. తాజాగా ఈ సంస్థ స్పేసెస్ రికార్డింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.
ఈ ట్విట్టర్ స్పేసెస్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, జనాదరణ పొందిన సెలబ్రెటీలు పాల్గొంటారు. వారు వివిధ విషయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడతారు. కేవలం ఆడియో రూపంలోనే కాకుండా ఫోటోలు, వీడియోలతో చర్చలను నిర్వహిస్తారు. ఫాలోవర్లను ఆ చర్చల్లో నిమగ్నం చేస్తారు. అందుకే స్పేసెస్ గత కొంత కాలంగా ప్రాచుర్యం పొందాయి. తాజా అప్డేట్ ప్రకారం ట్విట్టర్ యూజర్లు ఇప్పుడు కేవలం హోస్ట్ చేయడమే కాకుండా స్పేసెస్‌ను రికార్డ్ చేయవచ్చు. ఈ రికార్డింగ్ ఫీచర్‌తో వ్యక్తుల స్క్రీన్‌ను రికార్డ్ చేసి, మళ్లీ మళ్లీ చూడవచ్చు.
ట్విట్టర్ స్పేస్ కార్డ్‌లో “ప్లే రికార్డింగ్” బటన్‌ను నొక్కడం ద్వారా మీరు రికార్డ్ చేసిన సంభాషణను ప్లే చేయవచ్చు. అయితే ఇవి లైఫ్ లాంగ్ అందుబాటులో ఉండవు. మీరు రికార్డ్ చేసిన అన్ని స్పేస్‌లు 30 నుంచి 120 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత వాటిని మీరు ప్లే చేయలేరు. ఈ ఫీచర్‌ను సంస్థ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ ఒకేసారి అందుబాటులోకి తెచ్చింది.
1. ట్విట్టర్ స్పేస్‌ని హోస్ట్ చేస్తున్నప్పుడు, యూజర్లు తప్పనిసరిగా ‘రికార్డ్ స్పేస్’ ఆప్షన్‌పై నొక్కాలి. దీని తర్వాత, స్పేస్ రికార్ట్ మొదలైందని తెలిపే లోగో స్క్రీన్ పైన కనిపిస్తుంది.
2. మాట్లాడే వారు మాత్రమే స్పేస్ సెషన్లను రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది.
3. స్పేస్ ముగిసిన తర్వాత, ట్వీట్ ద్వారా స్పేస్ రికార్డింగ్‌ను షేర్ చేయవచ్చు.
4. దీన్ని ఫాలోవర్స్‌తో షేర్ చేసే ముందు 'ఎడిట్ స్టార్ట్ టైమ్' ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా స్పేస్ ప్రారంభంలో అవసరం లేని సంభాషణను కట్ చేయవచ్చు.
5. మీ రికార్డింగ్‌ను ప్లే చేయడానికి టైమ్‌లైన్‌లో కనిపించే ‘ప్లే రికార్డింగ్’ బటన్‌పై క్లిక్ చేయవచ్చు.
6. మీ ‘డేటా’ ఫోల్డర్‌లోని స్పేస్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
7. మీరు రికార్డ్ చేసిన స్పేస్‌లను ఎప్పుడైనా తొలగించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.