హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ఎలాన్ మస్క్ సంచలనం : భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు మూసివేత..ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

ఎలాన్ మస్క్ సంచలనం : భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు మూసివేత..ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Twitter shuts Delhi and Mumbai offices : గతేడాది ప్రముఖ సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్టర్‌(Twitter) ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon musk)..సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Twitter shuts Delhi and Mumbai offices : గతేడాది ప్రముఖ సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్టర్‌(Twitter) ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon musk)..సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సంస్థ ఉద్యోగులను తొలగించడంతో పాటూ కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఖ‌ర్చులు త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో గ‌త ఏడాది ట్విట్ట‌ర్ సంస్థ.. ఇండియాలో ప‌నిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియాలో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండిటిని మూసివేసింది. ట్విట్టర్ ఇండియా టీమ్ లో కేవలం ఉద్యోగులు మాత్రమే మిగిలి ఉన్నందున ట్విట్టర్ తన ముంబై, న్యూఢిల్లీ కార్యాలయాలను మూసివేసింది. ట్విటర్ యొక్క ఇండియా టీమ్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home)కంటిన్యూ చేయనున్నారు.

ఇండియాలో ట్విట్ట‌ర్ వినియోగ‌దారులు ఎక్కువ‌గానే ఉన్నా,ఆదాయం మాత్రం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు సమాచారం. అందుకే ఇండియాలో ఉన్న రెండు ఆఫీసుల్ని మూసివేసేందుకు మ‌స్క్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ట్విట్టర్ ప్రస్తుతం..భారత్ లో కేవ‌లం బెంగుళూరులో ఉన్న ఆఫీసు నుంచి మాత్ర‌మే త‌న కార్య‌క‌లాపాల్ని కొన‌సాగిస్తోంది. అక్క‌డ ఎక్కువ శాతం మంది ఇంజినీర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యొక్క బెంగళూరు కార్యాలయం.. అమెరికా హెడ్ ఆఫీసుకి నేరుగా రిపోర్ట్ చేసే ఇంజనీర్లను కలిగి ఉంటుంది,ఇది ఇండియా టీమ్ లో భాగం కాదు.

Air India: దటీజ్ టాటా..840 కొత్త విమానాల కోసం ఎయిరిండియా ఆర్డర్

అయితే పోటీలో నిలదొక్కుకుని నిలబడడానికి బదులు ఇండియాలో ఇంటర్నెట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి తరుణంలో ట్విట్టర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు,గతేడాది భారత్ లో అనేక సందర్భాల్లో వార్లల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

First published:

Tags: Elon Musk, Twitter