హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter : ట్విట్టర్ లో బిగ్ ఇష్యూ..సేవలకు అంతరాయం!

Twitter : ట్విట్టర్ లో బిగ్ ఇష్యూ..సేవలకు అంతరాయం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Links on Twitter inaccessible : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్(Twitter) సేవలకు సోమవారం అంతరాయం కలిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Links on Twitter inaccessible : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్(Twitter) సేవలకు సోమవారం అంతరాయం కలిగింది. ట్విట్టర్ నుండి ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను యాక్సెస్ చేయడంలో సమస్యలను యూజర్లు ఎదుర్కొంటున్నారు. ట్వీట్‌లపై లింక్‌లపై క్లిక్ చేయడం, ఫొటోలను లోడ్ చేయడం, TweetDeck వంటి కొన్ని ట్విట్టర్ సేవలకు లాగిన్ చేయడం వంటి సమస్యలు ఉన్నాయి.

పబ్లిష్ చేయబడిన ట్వీట్ నుండి లింక్‌పై క్లిక్ చేసినప్పుడు యూజర్లకు ఎర్రర్ మెసేజ్‌"{"errors":[{"message":"Your current API plan does not include access to this endpoint, please see https://developer.twitter.com/en/docs/twitter-api for more information","code":467}]}"ఇలా కనిపిస్తోంది.  అమెరికా,యూకే మరియు ఇతర దేశాల నుండి వేలాది ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Heart Attack Signs : ఈ 5 లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే అవకాశం!

మరోవైపు,ట్విట్టర్‌లో త్వరలో మార్పులు రానున్నాయని సిఇఓ ఎలాన్‌ మస్క్‌ సోమవారం వెల్లడించారు. రాబోయే రోజుల్లో ట్విట్టర్‌లో 10వేల అక్షరాలతో పోస్ట్‌ చేసేందుకు వీలుగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైక్రో బ్లాగింగ్‌ పోస్టుల్లోని అక్షరాలను 4 వేలకు పొడిగిస్తూ గత నెలలోనే ట్విటర్‌ కంపెనీ వెల్లడించింది. అయితే ఈ అవకాశం బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. సబ్‌స్క్రైబర్లు కానివారికి ట్వీట్లను చదివేందుకు, రీట్వీట్‌ చేసేందుకు కోట్‌ చేసే సదుపాయం మాత్రమే ఉంటుంది. గతంలో ట్వీట్లకు 280 అక్షరాలకు మాత్రమే పరిమితి ఉంది. ఇప్పటికీ ఈ సదుపాయం సబ్‌స్క్రైబ్‌ కాని వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే మైక్రోబ్లాగింగ్‌ పోస్ట్‌ల అక్షరాలను పెంచినప్పటికీ.. నిర్దిష్టమైన సమాచారం కోసం యూజర్లకు చార్జ్‌ చేసే అవకాశముందని కూడా మస్క్‌ తెలిపారు.

First published:

Tags: Twitter

ఉత్తమ కథలు