హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Edited Tweet: ఎడిటెడ్ ట్వీట్‌ను తొలిసారిగా పోస్ట్ చేసిన ట్విట్టర్.. ఫిదా అవుతున్న యూజర్లు..

Edited Tweet: ఎడిటెడ్ ట్వీట్‌ను తొలిసారిగా పోస్ట్ చేసిన ట్విట్టర్.. ఫిదా అవుతున్న యూజర్లు..

Edited Tweet: ఎడిటెడ్ ట్వీట్‌ను తొలిసారిగా పోస్ట్ చేసిన ట్విట్టర్.. ఫిదా అవుతున్న యూజర్లు..

Edited Tweet: ఎడిటెడ్ ట్వీట్‌ను తొలిసారిగా పోస్ట్ చేసిన ట్విట్టర్.. ఫిదా అవుతున్న యూజర్లు..

ఎడిట్ చేసిన ట్వీట్ (Edited Tweet) ఎలా ఉంటుందో ట్విట్టర్ తాజాగా వెల్లడించింది. దాంతో ఫ్యూచర్‌లో ఎడిటెడ్ ట్వీట్లు ట్విట్టర్‌లో ఎలా ఉంటాయో యూజర్లందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా యాప్‌లలో ట్విట్టర్ (Twitter) ఒకటి. ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ విషయాలపై తాజా సమాచారం, వార్తలు, అప్‌డేట్స్‌ చాలా ఫాస్ట్‌గా తెలుసుకోవచ్చు. అయితే మోస్ట్ పవర్‌ఫుల్ సోషల్ మీడియా సైట్స్‌లో ఒకటైన ఇందులో ఎడిట్ బటన్ (Edit Button) అనే ఫీచర్ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. దీనిని యూజర్లందరికీ తీసుకొస్తున్నట్లు గతంలోనే ట్విట్టర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎడిట్ చేసిన ట్వీట్ (Edited Tweet) ఎలా ఉంటుందో ట్విట్టర్ తాజాగా వెల్లడించింది. దాంతో ఫ్యూచర్‌లో ఎడిటెడ్ ట్వీట్లు ట్విట్టర్‌లో ఎలా ఉంటాయో యూజర్లందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది.

తాజాగా ట్విట్టర్ బ్లూ (Twitter Blue) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ తన ట్వీట్‌ని ఎడిట్ చేసింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన తొలి ఎడిటెడ్ ట్వీట్ ఇదే. ఈ ట్వీట్‌లో “ఇది ఎడిట్ బటన్ పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక టెస్ట్, ఇది ఎలా వర్క్ అవుతుందో మేం మీకు తెలియజేస్తాం.” అని ట్విట్టర్ బ్లూ పేర్కొంది.

ఈ ఎడిటెడ్ ట్వీట్ కింద ఒక పెన్సిల్ గుర్తు కనిపించింది. దాని పక్కనే టైమ్‌ స్టాంప్‌తో సహా లాస్ట్ ఎడిటెడ్ (Last Edited) అనే ఒక ఆప్షన్ బ్రైట్ బ్లూ కలర్‌లో కనిపించింది. దీనిపై క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ చేసిన ట్వీట్‌తో పాటు ఎడిట్ ట్వీట్ హిస్టరీ కనిపించింది. అంటే ఒరిజినల్ ట్వీట్ ఏంటనేది యూజర్లు ఈజీగా ఈ పెన్సిల్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

Amazon: గ్రేట్ ఇండియన్ సేల్‌లో ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ ప్రొడక్టులపై బెస్ట్‌ డీల్స్‌.. అమెజాన్ డిస్కౌంట్స్ ఇవే..

ట్విట్టర్ బ్లూ పోస్ట్ చేసిన ఒరిజినల్ ట్వీట్‌లో “ఇది ఎడిట్ బటన్ పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక టెస్ట్” అని మాత్రమే కనిపించింది. దీన్నే ట్విట్టర్ బ్లూ ఎడిట్ చేసి "ఇది ఎలా వర్క్ అవుతుందో మేం మీకు తెలియజేస్తాం.” అనే సెంటెన్స్ కొత్తగా యాడ్ చేసింది. ట్విట్టర్ బ్లూ సెప్టెంబర్ 30న ఈ ఎడిటెడ్ ట్వీట్ పోస్ట్ చేసింది. ఎడిట్ హిస్టరీలో కనిపించే అన్ని ప్రీవియస్ ట్వీట్లకు రిప్లైలు, లైక్స్/రీట్వీట్‌లు మొదలైనవి ఉంటాయని ఈ ఎడిటెడ్ ట్వీట్ చూస్తే స్పష్టమవుతోంది.

యూజర్లు తమ ట్వీట్‌లను పోస్ట్ చేశాక వాటిని 30 నిమిషాలలోపు కొన్నిసార్లు ఎడిట్ చేయడం కుదురుతుందని గతంలో కంపెనీ తెలిపింది. ట్విట్టర్ బ్లూ యూఎస్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 4.99 (దాదాపు రూ.400) డాలర్ల నెలవారీ ఫీజుతో అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో మొదటగా ఎడిట్ బటన్ విడుదలవుతుంది.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

తాజాగా పోస్ట్ చేసిన ఈ ఎడిటెడ్ ట్వీట్ చూసి యూజర్లు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ సరి చేసుకోవడానికి, ఏవైనా పదాలను తొలగించడానికి ఎడిట్ బటన్ తమకు ఎంతో యూజ్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే రెగ్యులర్ యూజర్ల కంటే డబ్బులు చెల్లించే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకే ముందుగా ఎడిట్ బటన్ అందుబాటులోకి వస్తుంది.

కాగా యూజర్లు ఎడిట్ బటన్ అనేది కేవలం పెయిడ్ యూజర్స్‌కి మాత్రమే పరిమితం అవుతుందేమోనని భయపడుతున్నారు. డబ్బులు చెల్లించని సాధారణ యూజర్లకు ఎడిట్ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కంపెనీ క్లారిటీ ఇస్తే గానీ యూజర్లలో ఈ డౌట్ క్లారిఫై అవ్వదు.

Published by:Veera Babu
First published:

Tags: Edited tweet, Features, Twitter, Twitter review

ఉత్తమ కథలు