ట్విటర్‌లో 'ఎడిట్' బటన్.. కానీ ఓ కండిషన్.. అసలు సాధ్యమేనా..?

ట్విటర్ అధికారిక ఖాతా నుంచి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ప్రపంచంలో అందరూ మాస్క్‌లు ధరించడం సాధ్యమేనా? అని నోరెళ్లబెడుతున్నారు. అందరూ అంటే డొనాల్డ్ ట్రంప్ కూడానా అంటూ ఓ నెటిజన్ ఫన్నీ ట్వీట్ చేశాడు.

news18-telugu
Updated: July 3, 2020, 7:58 PM IST
ట్విటర్‌లో 'ఎడిట్' బటన్.. కానీ ఓ కండిషన్.. అసలు సాధ్యమేనా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌లో ఇప్పటి వరకు 'ఎడిట్' ఆప్షన్ లేదు. ఏదైనా ట్వీట్‌లో తప్పులు ఉండే సరిచేసుకోలేం. దాన్ని డిలీట్ చేసి, కొత్తగా ట్వీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్విటరాటీలకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది ట్విటర్. 'ఎడిట్' బటన్ తెస్తామంటూ ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. ఐతే దీని కోసం వెరైటీ కండిషన్ పెట్టింది. అందరూ మాస్క్‌లు ధరిస్తే ట్విటర్‌లో ఎడిట్ బటన్ తెస్తామని చెప్పింది.


'అందరు అంటే అందరూ' అని అర్ధమని..దానికి అనుబంధంగా మరో ట్వీట్ చేసింది.

ట్విటర్ అధికారిక ఖాతా నుంచి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ప్రపంచంలో అందరూ మాస్క్‌లు ధరించడం సాధ్యమేనా? అని నోరెళ్లబెడుతున్నారు. అందరూ అంటే డొనాల్డ్ ట్రంప్ కూడానా అంటూ ఓ నెటిజన్ ఫన్నీ ట్వీట్ చేశాడు.

మరో నెటిజన్ కాస్త వెరైటీగా స్పందించాడు. ఇకపై నాపేరు EVERYONEగా మార్చుకుంటాని చెప్పాడు. అప్పుడు తాను మాస్క్ ధరిస్తే, ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్ వస్తందని ట్వీట్ చేశాడు.
అసలు ఇది అసాధ్యమని.. దీన్ని బట్టి ట్విటర్‌కు ఎడిట్ బటన్ తెచ్చే ఉద్దేశం లేదని మరికొందరు స్పందిస్తున్నారు.

కాగా, ఫేస్ బుక్‌లో ఎడిట్ ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. మనం చేసిన పోస్ట్‌ని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం ట్విటర్ యూజర్లు ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
Published by: Shiva Kumar Addula
First published: July 3, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading