వాట్సప్ లాంటి ఫీచర్ ఇక ట్విట్టర్‌లో... ఇన్-యాప్ కెమెరా ఇలా వాడాలి

Twitter In-App Camera Feature | ఈ ఫీచర్ వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లో ఉంది. ఇప్పుడు ట్విట్టర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్ యాప్‌తో పాటు ఐఓఎస్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: March 15, 2019, 5:16 PM IST
వాట్సప్ లాంటి ఫీచర్ ఇక ట్విట్టర్‌లో... ఇన్-యాప్ కెమెరా ఇలా వాడాలి
వాట్సప్ లాంటి ఫీచర్ ఇక ట్విట్టర్‌లో... ఇన్-యాప్ కెమెరా ఇలా వాడాలి
  • Share this:
మీరు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లేదా స్నాప్‌చాట్ వాడుతున్నారా? వాటిలో ఇన్-యాప్ కెమెరా ఫీచర్ మిమ్మల్ని ఆకట్టుకుని ఉంటుంది. ఇప్పుడు అదే ఫీచర్ ట్విట్టర్‌లో కూడా వచ్చేసింది. మీరు ట్విట్టర్ నుంచే నేరుగా కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫోటోలు క్లిక్ చేయొచ్చు. వీడియో రికార్డ్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా ఫోటో క్లిక్ చేసి వాట్సప్‌లో పంపించాలనుకుంటే మీరు కెమెరా ఆన్ చేసి ఫోటో క్లిక్ చేసి, ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి పంపాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఇన్-యాప్ కెమెరా ఫీచర్ ద్వారా ఫోటో క్లిక్ చేసి పంపొచ్చు. ఈ ఫీచర్ వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లో ఉంది. ఇప్పుడు ట్విట్టర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్ యాప్‌తో పాటు ఐఓఎస్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు.


ట్విట్టర్‌లో ఇన్-యాప్ కెమెరా ద్వారా ఫోటోలు క్లిక్ చేసి, కామెంట్ పెట్టి పోస్ట్ చేయొచ్చు. 280 సెకన్లపాటు వీడియో రికార్డ్ చేసి ట్వీట్ చేయొచ్చు. ఇందుకోసం యూజర్లు ట్విట్టర్‌ ఫీడ్‌లో ఎడమవైపు నుంచి స్వైప్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. ఫోటో క్లిక్ చేసి పంపొచ్చు తప్ప... అప్పటికే ఫోటో గ్యాలరీలో ఉన్న పిక్స్‌ని యాడ్ చేయడం సాధ్యం కాదు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. త్వరలో ఈ ఫీచర్ మీ ట్విట్టర్‌లో అప్‌డేట్ అవుతుంది.Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్
ఇవి కూడా చదవండి:

Healthy Sleep Tips: హాయిగా నిద్రపోవాలంటే ఈ 9 టిప్స్ ఫాలో అవండి

Wi-Fi 6: ఈ వైఫైతో 3 సెకన్లలో 3 సినిమాల డౌన్‌లోడ్... ఇలా సాధ్యం

IRCTC PNR Linking: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి... ప్రయాణికులకు ఎంత లాభం?
First published: March 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు