హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Edit Button: ట్విట్టర్ నుంచి అదిరిపోయే ఫీచర్.. కానీ, వారికి మాత్రమే.. త్వరలోనే అందరికీ..

Twitter Edit Button: ట్విట్టర్ నుంచి అదిరిపోయే ఫీచర్.. కానీ, వారికి మాత్రమే.. త్వరలోనే అందరికీ..

ట్విట్టర్ న్యూ ఫీచర్

ట్విట్టర్ న్యూ ఫీచర్

Twitter Edit Button: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) తన యూజర్లకు చాలా ఉపయోగకరమైన ఫీచర్ల (Features)ను పరిచయం చేసింది. లేటెస్ట్ గా అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. కానీ, కండీషన్లు మాత్రం అప్లై..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) తన యూజర్లకు చాలా ఉపయోగకరమైన ఫీచర్ల (Features)ను పరిచయం చేసింది. కానీ ఎన్నో ఏళ్లుగా యూజర్లు అడుగుతున్న ఎడిట్ (Edit) ఫీచర్‌ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. చివరికి యూజర్ల అభ్యర్థనల మేరకు దీనిని తీసుకొస్తున్నట్లు 4 నెలల క్రితం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఎడిట్ బటన్ (Edit Button) ఫీచర్‌ను టెస్టింగ్ (Testing) చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ ఫీచర్‌లో ఏవైనా సమస్యలు లేదా లోపాలు ఉన్నాయా అనేది ముందుగానే గుర్తించడానికి కొంతమంది పెయిడ్ యూజర్లతో ట్విట్టర్ టెస్టింగ్ స్టార్ట్ చేసింది. టెస్టింగ్ విజయవంతంగా పూర్తయ్యాక ఈ ఎడిట్ ఫీచర్ ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మొదటగా విడుదల కానుంది. ఆ తర్వాత రెగ్యులర్ యూజర్లందరికీ దీనిని రిలీజ్ చేసే అవకాశం ఉంది.

* ఎడిట్ బటన్ ప్రయోజనాలు

ప్రస్తుతం యూజర్లు ట్వీట్ చేసిన తర్వాత అందులో టైపింగ్ మిస్టేక్స్‌ లేదా నచ్చని పదాలు గుర్తించి.. వాటిని ఎడిట్ చేసుకోవాలనుకున్నా కుదరదు. మళ్లీ ఆ ట్వీట్ డిలీట్ చేసి కొత్తగా ట్వీట్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఈ శ్రమ అంతా తప్పుతుంది. ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి వీటిలో కావాల్సిన టెక్స్ట్ ఈజీగా ఎడిట్ చేసుకోవడం కుదురుతుంది. దానివల్ల సమయంతో పాటు మరోసారి ట్వీట్ పోస్ట్ చేయాల్సిన అవసరం తప్పుతుంది.

* టెస్టర్లకు లాంచ్

సెప్టెంబర్‌ ఒకటో తేదీన ట్విట్టర్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఎడిట్ బటన్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఒక ట్వీట్ చేస్తూ.. "మీరు ఎడిటెడ్ ట్వీట్‌ని చూస్తూ ఉంటే.. దానికి కారణం మేం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడమే." అని ట్విట్టర్ పేర్కొంది. ప్రస్తుతానికి టెస్టింగ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా సెలెక్టెడ్ బ్లూ ట్విట్టర్ సబ్‌స్క్రైబర్లకు ఈ బటన్‌ను అందుబాటులోకి తెస్తోంది. వారందరూ ఎర్లీ యాక్సెస్‌తో ఈ బటన్ ఉపయోగించనున్నారు.

* ఆ దేశాల్లో అందుబాటులోకి..

టెస్టింగ్ సమయంలో యూజర్లు ఎడిట్ ట్వీట్‌ను ఎలా యూజ్‌ చేస్తున్నారు? వీఐపీలు ఎక్కువగా ఉండే తన ఫ్లాట్‌ఫామ్‌లో ఎవరైనా ఎడిట్ బటన్‌ను దుర్వినియోగం చేస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోనుంది. ఏ సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకే ట్విట్టర్ ఈ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ట్విట్టర్ బ్లూ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూఎస్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పెయిడ్ సర్వీస్ కోసం నెలకు 4.99 డాలర్లు (రూ.397) చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్‌కు సంబంధించి ఈ ఏడాదిలో కొన్ని లీక్స్‌ ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటి ప్రకారం ఎడిటెడ్ ట్వీట్‌ల కింద కనిపించే ఎడిట్ హిస్టరీపై క్లిక్ చేయడం ద్వారా ఒక యూజర్ ఒరిజినల్ ట్వీట్‌ని ఎలా మాడిఫై చేశారనేది తెలుస్తుంది. అంటే ఇది అచ్చం ఫేస్‌బుక్ ఎడిట్ బటన్ లాగానే ఉంటుందని అర్థమవుతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన యూజర్లు ఒక ట్వీట్ పోస్ట్ అయిన 30 నిమిషాల వ్యవధిలో దాన్ని కొన్ని సార్లు వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిటెడ్ ట్వీట్ల కింద పెన్సిల్ ఐకాన్, టైమ్‌స్టాంప్, లేబుల్‌ వంటివి కనిపిస్తాయి. దీనివల్ల ఒరిజినల్ ట్వీట్ ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Tech news, Technology, Twitter

ఉత్తమ కథలు