Home /News /technology /

TWITTER NOW TESTING CO TWEET FEATURE FOR USERS UMG GH

Twitter: యూజర్ల కోసం కో-ట్వీట్ ఫీచర్‌ తీసుకొస్తున్న ట్విట్టర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..!

ట్విట్టర్ న్యూ ఫీచర్

ట్విట్టర్ న్యూ ఫీచర్

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్లు లాంచ్ చేస్తోంది. మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంది. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం కో-ట్వీట్ (CoTweet) అనే మరో ఫీచర్‌ని తీసుకొస్తున్నామని ప్ర?

ఇంకా చదవండి ...
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు కొత్త ఫీచర్లు లాంచ్ చేస్తోంది. మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంది. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం కో-ట్వీట్ (CoTweet) అనే మరో ఫీచర్‌ని తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఈ ఫీచర్‌ని ఇప్పటికే యూఎస్, కెనడా, కొరియాలోని సెలెక్టెడ్ యూజర్లతో టెస్ట్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫీచర్‌ సాయంతో ఒకటే ట్వీట్‌ను ఇద్దరు యూజర్లు ఒకే సమయంలో పోస్ట్ చేయవచ్చు. ఈ ట్వీట్‌ హెడ్డర్‌లో ఆ ఇద్దరు యూజర్ల ప్రొఫైల్ ఫొటోలు, యూజర్‌నేమ్స్ కనిపిస్తాయి. అలానే ఈ ట్వీట్‌ ఆ ఇద్దరి యూజర్ల ప్రొఫైల్స్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా, వారి ఫాలోవర్ల టైమ్‌లైన్‌లోనూ కనిపిస్తుంది. ఈ ట్వీట్‌లో ఇద్దరి అకౌంట్స్ ట్యాగ్ అవుతాయి. ఈ ఫీచర్‌ను కొంత సమయం వరకు మాత్రమే టెస్టింగ్ చేస్తామని ట్విట్టర్ పేర్కొంది.

యూజర్లు తమ ఫ్రెండ్స్ లేదా ఫాలోవర్లతో కో-ట్వీట్ చేసే అవకాశాన్ని ట్విట్టర్ అందిస్తోంది. దీనిని ఇప్పటికే సెలెక్టెడ్ యూజర్లు టెస్ట్ చేస్తున్నారు. CoTweet అనేది ప్రాథమికంగా ఒకే ట్వీట్ కానీ ఇది రెండు అకౌంట్స్ కలిగి ఉంటుంది. ఈ రెండూ ఒకే ట్వీట్‌లో ట్యాగ్ అవుతాయని ట్విట్టర్ వివరించింది. "ట్విటర్‌లో ప్రజలు కలిసి పని చేయడానికి, కలిసి ట్వీట్ చేయడానికి మేం కొత్త మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తున్నాం" అని ట్విట్టర్ ప్రతినిధి జోసెఫ్ జె. నునెజ్ వెబ్‌సైట్ ద్వారా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. "కొత్త ఆడియన్స్‌ను పెంచుకోవడానికి లేదా చేరుకోవడానికి ఇతర అకౌంట్‌లతో వారి సహకారాన్ని బలోపేతం చేయడానికి వ్యక్తులు, బ్రాండ్‌లు ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించనున్నారో తెలుసుకోవడానికి మేం పరిమిత సమయం వరకు CoTweetsని టెస్ట్ చేస్తున్నాం" అని నునెజ్ తెలిపారు.

CoTweets ఎలా పని చేస్తాయి?

ఇద్దరు యూజర్లు CoTweet చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు ట్వీట్ చేయాలనుకుంటున్న కంటెంట్‌ను ముందుగా రెడీ చేసుకోవాలి. కో-ట్వీట్‌లో కంటెంట్ ఏం ఉండాలో తెలుసుకోవడానికి కో-ఆథర్‌కు డైరెక్ట్ మెసేజ్‌ చేసి అడగొచ్చు. ఇద్దరు కలిసి కంటెంట్‌ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక యూజర్ CoTweetని క్రియేట్ చేయాలి. తర్వాత ఎవరితో కో-ట్వీట్ చేయదలచుకున్నారో వారికి ఇన్విటేషన్ పంపించాలి. కో-ఆథర్ CoTweet ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు.. CoTweet వెంటనే వీరిద్దరి ప్రొఫైల్‌లో ఒకే సమయంలో పోస్ట్ అవుతుంది. ఇద్దరి ఫాలోవర్ల టైమ్‌లైన్‌లలో కూడా పోస్ట్ అవుతుంది. అయితే, ఈ ట్వీట్‌కు రిప్లైలు ట్వీట్ మెయిన్ ఆథార్‌కే వెళ్తాయి. పరిమిత టెస్టింగ్ తర్వాత, ట్విట్టర్ ఫీచర్‌ని అందరికీ అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

CoTweetని ఎలా క్రియేట్ చేస్తారు?

ట్వీట్ కంపోజర్‌ని ఓపెన్ చేసి... కో-ఆథార్ కంటెంట్ రాసి CoTweet ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఫాలోవర్ల లిస్ట్‌ నుంచి కో-ఆథార్‌ను సెలెక్ట్ చేసుకొని, సెండ్ ఇన్వైట్ (Send Invite) ఆప్షన్‌పై టైప్ చేస్తే సరిపోతుంది. కో-ఆథార్ ఈ ఇన్వైట్ యాక్సెప్ట్ చేసిన అనంతరం కో-ట్వీట్ పోస్ట్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ 2021లోనే ఇలాంటి కో-ఆథార్ ఫీచర్‌ని లాంచ్ చేసింది.
Published by:Mahesh
First published:

Tags: New features, Tech news, Tweets, Twitter

తదుపరి వార్తలు