ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తరువాత అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు నుంచి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ వరకు చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్‌గా ఉన్న ట్విట్టర్‌లో ఇప్పుడు భారీ సైజ్‌లో ట్వీట్ చేయడానికి అవకాశం కల్పించారు. క్యారెక్టర్స్ లిమిట్ పెంపుపై వస్తున్న వార్తలను ఇప్పుడు నిజం చేశారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
ఇకపై 4,000 క్యారెక్టర్స్‌తో ట్వీట్
ఇప్పటివరకు ట్విట్టర్‌లో 280 క్యారెక్టర్స్ లిమిట్‌తో ట్వీట్ చేయడానికి అవకాశం ఉండేది. అయితే తాజాగా ట్వీట్ లిమిట్‌ను భారీగా పెంచింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై గరిష్టంగా 4,000 క్యారెక్టర్స్‌తో ట్వీట్ చేయవచ్చని పేర్కొంది. దీంతో యూజర్లు భారీ పరిమాణంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ట్వీట్ చేయవచ్చు. మొత్తం ట్వీట్‌ను పరిశీలించడానికి ఇకపై ఎక్కువ సార్లు స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే షో మోర్(Show more) అనే ఆప్షన్స్‌పై క్లిక్ చేస్తూ మొత్తం ట్వీట్‌ను చూడాల్సి ఉంటుంది.
ట్విట్టర్ స్పందన ఇలా
ఈ అంశంపై ట్విట్టర్ ఇలా స్పందించింది. వినియోగదారులు తమ భావాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి 280 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారని తెలిపింది. ఎలాంటి అంతరాయం లేకుండా ట్వీట్ చేయడానికి ఇష్టపడుతున్నారని, కొన్నిసార్లు విషయాలు అన్నింటినీ ఒకేసారి ట్వీట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొంది. అందుకు తగిన విధంగా లెంతీ ట్వీట్స్ చేసేలా కొత్త ఆప్షన్లు అందిస్తున్నామని ట్విట్టర్ బ్లూ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
ట్విట్టర్ బ్లూ సబ్‌స్ర్కైబర్స్‌కు మాత్రమే
అయితే ఈ ఫీచర్‌ను కేవలం కొందరికి మాత్రమే ట్విట్టర్ అందుబాటులోకి తీసుకురానుంది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్ర్కైబర్స్ మాత్రమే 4,000 కంటే ఎక్కువ క్యారెక్టర్స్‌తో ట్వీట్ చేయనున్నారు. ఇక నాన్-సబ్ స్ర్కైబర్స్ భారీ ట్వీట్‌లకు రిప్లై మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే రీట్వీట్, కోట్ చేయడానికి అవకాశం కల్పించనున్నారు. బ్లూసబ్ స్ర్కైబర్స్ గరిష్టంగా 4,000 క్యారెక్టర్స్‌తో ట్వీట్ చేయడంతో పాటు రిప్లై, ట్వీట్‌లను కోట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ముందుగా అమెరికా యూజర్లకు
4000 క్యారెక్టర్స్ ఫీచర్‌ను ముందుగా అమెరికా యూజర్లకు ట్విట్టర్ అందుబాబులోకి తీసుకొచ్చింది. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి, యూజర్లు వెబ్‌లో ఎక్కువ కాలం ట్వీట్‌లను డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేయలేరు. వాటిని తర్వాత షెడ్యూల్ చేయలేరని ట్విట్టర్ పేర్కొంది.
ట్విట్టర్ లెటెస్ట్ లిమిట్స్ వివరాలు
ఆల్ యూజర్ల కోసం ట్విట్టర్ తాజాగా కొత్త లిమిట్స్‌ను ప్రకటించింది. ట్విట్టర్ యూజర్లు ఇకపై ఇకపై రోజుకు 500 డెరెక్ట్ మెసేజ్‌లు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక రోజుకు 2400 సార్లు మాత్రమే ట్వీట్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రీట్వీట్స్‌తో కలిపి దీన్ని కౌంట్ చేయనున్నారు. అకౌంట్ ఇమెయిల్ గంటకు నాలుగు సార్లు మార్చవచ్చు. ఒక రోజుకు 400 అకౌంట్స్ మాత్రమే ఫాలో కావడానికి అవకాశం ఉంటుంది. ఫాలోయింగ్ (అకౌంట్): ఒక అకౌంట్ 5,000 ఇతర అకౌంట్స్ ను ఫోలో చేస్తే తదుపరి ఫాలోయింగ్స్ “అకౌంట్-స్పెసిఫిక్ రేషియో” ద్వారా పరిమితం చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Twitter