#PowerOf18... ఎన్నికల్లో ఓటెయ్యండి: యువతకు ట్విట్టర్ పిలుపు

ట్విట్టర్ భారతదేశంలో 3,622 మంది యువకులతో జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించింది. వారిలో 94 శాతం మంది రాబోయే ఎన్నికల్లో తాము ఓటేస్తామని చెప్పారు. సమాచారాన్ని తెలుసుకోవడంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరుగుతోందని ఈ సర్వేలో తేలింది.

news18-telugu
Updated: November 13, 2018, 10:54 AM IST
#PowerOf18... ఎన్నికల్లో ఓటెయ్యండి: యువతకు ట్విట్టర్ పిలుపు
#PowerOf18... ఎన్నికల్లో ఓటెయ్యండి: యువతకు ట్విట్టర్ పిలుపు
  • Share this:
#PowerOf18... సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ భారతదేశంలో ప్రారంభించిన కొత్త కార్యక్రమం ఇది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యువతను భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికలతో పాటు ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకొని ప్రజాసమస్యలపై చర్చల్లో యువతీయువకులు పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ, ట్విట్టర్ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మాయా హరి ఐఐటీ-ఢిల్లీలో 'పవర్ ఆఫ్ 18' కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంతో పాటు దేశంలో జరిగే ఎన్నికల్లో యువత భాగస్వామ్యం పెంచడమే 'పవర్ ఆఫ్ 18' కార్యక్రమం ఉద్దేశంమని హరి అన్నారు.


ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ట్విట్టర్ భారతదేశంలో 3,622 మంది యువకులతో జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించింది. వారిలో 94 శాతం మంది రాబోయే ఎన్నికల్లో తాము ఓటేస్తామని చెప్పారు. సమాచారాన్ని తెలుసుకోవడంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరుగుతోందని ఈ సర్వేలో తేలింది. భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు 60 శాతం మంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నట్టు తేలింది. ఓటింగ్ ప్రాముఖ్యతపై చైతన్యం తీసుకొచ్చేందుకు మరికొన్ని సంస్థలు, వ్యక్తులతో కలిసి పనిచేస్తామని ట్విట్టర్ వెల్లడించింది.



ఇవి కూడా చదవండి:వాట్సప్ స్టిక్కర్లలో ఇకపై సెర్చ్ ఆప్షన్

బ్యాడ్ న్యూస్: ఫోన్ల ధరలు పెంచిన షావోమీ, రియల్‌మీ

సెల్ఫీలు ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారా? ఆ పిచ్చి ఉన్నట్టే...

రోజూ రూ.35 చెల్లిస్తే రూ.4.72 లక్షలు మీవే...

ఒంటరితనం, ఒత్తిడికి సోషల్ మీడియానే కారణం
First published: November 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>