Home /News /technology /

TWITTER IS TESTING SPECIAL TEXT FEATURES IN TWEETS RELEASED SOON FOR ANDROID USERS GH VB

Twitter: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్వీట్స్‌లో కొత్త ఫీచర్ దిశగా అడుగులు..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ట్విట్టర్ సిద్ధమయ్యింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు ట్విట్టర్ యాప్ లో ట్వీట్స్ లోని తమకు కావాల్సిన టెక్స్ట్ వరకు కాపీ (Text Copy) చేయొచ్చు.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్ల కోసం తరచుగా యూజ్‌ఫుల్ ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్ల (Android Users) కోసం యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తోంది. ఇందులో భాగంగా మరొక అదిరిపోయే ఫీచర్‌ను (New Feature) తీసుకొచ్చేందుకు ట్విట్టర్ సిద్ధమయ్యింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు ట్విట్టర్ యాప్ లో ట్వీట్స్ లోని తమకు కావాల్సిన టెక్స్ట్ వరకు కాపీ (Text Copy) చేయొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఈజీ టెక్స్ట్ సెలక్షన్ ఆప్షన్ అందుబాటులో లేదు. దీంతో వారు ట్వీట్ లోని టెక్స్ట్ మొత్తం కాపీ చేయగలుగుతున్నారు కానీ తమకు కావాల్సిన పార్ట్ వరకు టెక్స్ట్ కాపీ చేయలేకపోతున్నారు. అయితే కొత్తగా రానున్న ఫీచర్‌తో ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్ లోని పర్టిక్యులర్ టెక్స్ట్ ని కాపీ చేసి ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు. ఈ స్పెషల్ టెక్స్ట్ ఫీచర్స్ ను ప్రస్తుతం ట్విట్టర్ పరిశీలిస్తోంది

ఈ అప్‌కమింగ్ ఫీచర్‌ను లీకర్, హిడెన్ ఫీచర్ డిటెక్టివ్ జేన్ మంచున్ వాంగ్ ఓ ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. "ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సెలెక్ట్ టెక్స్ట్ ఆన్ ట్వీట్స్ ఫీచర్‌ను ఎట్టకేలకు తీసుకొచ్చేందుకు ట్విట్టర్ వర్క్ చేస్తోంది" అని వాంగ్ పేర్కొన్నారు. ఆమె ఒక ఫొటో కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో ట్వీట్ లోని మేటర్ కాపీ చేసిన టెక్స్ట్.. దానిపై "Copy, Share, Select All" అనే స్పెషల్ టెక్స్ట్ ఫీచర్స్ చూడొచ్చు. ప్రస్తుతం ట్విట్టర్ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఈజీ టెక్స్ట్ సెలక్షన్ ఆప్షన్ లేకపోవడంతో ఓవర్‌వ్యూ సెలక్షన్ ఆప్షన్ ఉపయోగిస్తున్నారు ఆండ్రాయిడ్ యూజర్లు. ఓవర్‌వ్యూ సెలక్షన్ అనేది కాపీ & పేస్ట్ చేయడానికి ఏదైనా స్క్రీన్ నుంచి టెక్స్ట్ ఎంచుకోవడానికి యూజర్లను అనుమతించే ఓ ఉపయోగకరమైన ఫీచర్.



అయితే పోడ్‌కాస్టర్, ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ ప్రకారం, ఓవర్‌వ్యూ సెలక్షన్ ఫీచర్ కేవలం కొన్ని ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనివల్ల కొందరు ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్ లోని పర్టిక్యులర్ టెక్స్ట్ కాపీ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ట్విట్టర్ సరికొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. నిజానికి ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ యాప్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు దీనిని పరిచయం చేసేందుకు ట్విట్టర్ చాలా ఆలస్యం చేస్తూ వస్తోంది. కొద్ది రోజుల్లో ఈ న్యూ ఫీచర్ విడుదల అవ్వచ్చు.



రీసెంట్ టైమ్స్ లో ట్విట్టర్ తన ఫ్లాట్‌ఫామ్‌ను చాలా ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తోంది. న్యూ కంపోజర్ బార్ నుంచి ట్విట్టర్ కమ్యూనిటీలను ఇతరులతో షేర్ చేయడం, ట్విట్టర్ రియాక్షన్ వీడియోస్, టాపిక్స్ ట్యాగ్ బార్ వరకు ట్విట్టర్ చాలా ఫీచర్స్‌ను రీసెంట్ గా లాంచ్ చేసింది. అంతేకాదు డైరెక్ట్ మెసేజ్ సెర్చ్ ఫీచర్ ను డెస్క్ టాప్, మొబైల్ యాప్ లో తీసుకొచ్చింది. అలాగే ట్వీట్స్ కోసం ఎడిట్ ఫీచర్ తీసుకొస్తున్నామని ట్విట్టర్ యాప్ ఇటీవలే అనౌన్స్ చేసింది. ఎడిట్ ఫీచర్ అందుబాటులో లేక ట్విట్టర్ యూజర్లు చాలా ఏళ్లుగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే త్వరలోనే రానున్న ఈ ఫీచర్‌తో సిల్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో పాటు వర్డ్స్ ను కూడా ఈజీగా ఎడిట్ చేయడం వీలవుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Technology, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు