ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని ట్విట్టర్ (Twitter) కొత్త సంస్కరణలు తీసుకొస్తోంది. అకౌంట్ల వెరిఫికేషన్ల విషయంలో చాలానే మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ కంపెనీలు తమ అకౌంట్లను వెరిఫై చేసుకోవడానికి వీలుగా ‘వెరిఫికేషన్ ఫర్ ఆర్గనైజేషన్స్ (Verification for Organisations)’ పేరిట ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గతంలో ఈ ఫీచర్‌ను ట్విట్టర్ 'బ్లూ ఫర్ బిజినెస్ (Blue for business)' అని పిలిచేవారు. ఈ ఫీచర్ మొదట సెలెక్టెడ్ కంపెనీలకు, ఆ తర్వాత ఇతర కంపెనీలకు అందుబాటులోకి వస్తుంది.
* వెరిఫై చేసుకోవడానికి అప్లికేషన్
ట్విట్టర్ బిజినెస్ పోస్ట్ చేసిన లింకులో ఒక ఫారమ్‌ను పూరించడం ద్వారా తమ అకౌంట్లను వెరిఫై చేసుకోవడానికి కంపెనీలు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అర్హత సాధిస్తే వారి అకౌంట్స్‌ను ట్విట్టర్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతుంది. ట్విట్టర్ కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో.. ‘ట్విట్టర్ ఆర్గనైజేషన్ల కోసం వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తోంది. కంపెనీలు వెయిట్‌లిస్ట్‌లో చేరడం ద్వారా ముందస్తు యాక్సెస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా మరికొద్ది వారాల్లో రోలింగ్ ప్రాతిపదికన పరిమిత అకౌంట్స్ యాక్సెస్ పొందవచ్చు.’ అని వెల్లడించింది.
కంపెనీలు తమ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవడానికి, వారి సొంత సంస్థలో నెట్‌వర్క్‌లను సృష్టించడానికి ట్విట్టర్ ఈ కొత్త ప్రోగ్రామ్‌ను రూపొందిస్తోంది. కంపెనీలు ట్విట్టర్‌లో తమ లీడర్‌షిప్, బ్రాండ్లు, సపోర్ట్ హ్యాండిల్స్, ఉద్యోగులు లేదా టీమ్స్‌ను ఈ వెరిఫికేషన్‌కి కనెక్ట్ చేయవచ్చు. తద్వారా ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై అవుతుంది. అలానే అధికారికంగా పేరెంట్ హ్యాండిల్‌కి లింక్ అవుతుంది.
* రూల్స్, ధర, ప్రాసెప్‌పై త్వరలో స్పష్టత
ట్విట్టర్ బ్లాగ్‌పోస్ట్ ప్రకారం.. ఒక కంపెనీ తన అనుబంధిత ఖాతాల (Affiliated accounts)ను లింక్ చేసినప్పుడు.. ఆ అకౌంట్స్ చెక్‌మార్క్ పక్కన ఆ పేరెంట్ కంపెనీ ప్రొఫైల్ పిక్చర్ చిన్న బ్యాడ్జ్‌గా కనిపిస్తుంది. తద్వారా ఆ కంపెనీకి చెందిన వారెవరు ఈజీగా ట్విట్టర్‌లో గుర్తుపట్టడం సాధ్యమవుతుంది.
ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రమాణాలు, ధర, ప్రక్రియ గురించి మరింత సమాచారాన్ని ఆర్గనైజేషన్లకు ట్విట్టర్ త్వరలో తెలియజేయనుంది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ సెలెక్టెడ్ బిజినెస్ గ్రూప్‌లతో పైలట్ ప్రాతిపదికన అమలు అవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థల కోసం ట్విట్టర్ దీన్ని ప్రారంభించనుంది.
ఇది కూడా చదవండి : ఐఫోన్ 14 ప్రో యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే డిస్‌ప్లే సమస్యలకు పరిష్కారం..
ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునేవారు ట్విట్టర్ బిజినెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన లింక్‌పై క్లిక్ చేసి అవసరమైన సమాచారం నమోదు చేస్తే సరిపోతుంది. ఇక ట్విట్టర్ తన వెరిఫికేషన్ సర్వీస్ ఫీజు, వేలం ద్వారా ఇన్‌యాక్టివ్ యూజర్ నేమ్స్ విక్రయించడం వంటి వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, New feature, Tech news, Twitter