TWITTER INTRODUSING NEW FEATURES SOFT BLOCKING KNOW HOW TO REMOVE FOLLOWERS WITHOUT BLOCKING THEM GH EVK
Twitter Features : ట్విట్టర్లో కొత్తగా సాఫ్ట్ బ్లాక్ ఫీచర్.. ఫాలోవర్లను బ్లాక్ చేయకుండానే తొలగించే అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
వెబ్ వెర్షన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్. ఫాలోవర్స్‌ను బ్లాక్ చేయకుండానే వారిని తొలగించే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను "సాఫ్ట్ బ్లాక్" పేరుతో లాంచ్ చేసింది. ప్రస్తుతం వెబ్ వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ మొబైల్ వెర్షన్‌లోకి మాత్రం అందుబాటులోకి రాలేదు.
వెబ్ వెర్షన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter). ఫాలోవర్స్‌ను బ్లాక్ చేయకుండానే వారిని తొలగించే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను "సాఫ్ట్ బ్లాక్" పేరుతో లాంచ్ చేసింది. ప్రస్తుతం వెబ్ వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ మొబైల్ వెర్షన్‌లోకి మాత్రం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే మొబైల్ వెర్షన్ (Mobile Version) లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫాలోవర్స్ నుంచి నిరంతర వేధింపులు, దుర్వినియోగాన్ని నిరోధించడానికి కంపెనీ ఈ కొత్త ఫీచర్ (New Future)ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్ ట్విట్టర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఫాలోవర్స్‌ను బ్లాక్ చేయకుండానే తొలగించే అవకాశం ఉంటుంది.
ఈ సాఫ్ట్ బ్లాక్ (Soft Block) ఫీచర్ పూర్తిగా బ్లాక్ చేయడం కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు ఎవరైనా ఫాలోవర్స్‌ను సాఫ్ట్ బ్లాక్ చేసినప్పటికీ, వారు మీ ట్వీట్లలను చూడగలరు. అదే పూర్తిగా బ్లాక్ చేసే సందర్భంలో, మీ ట్వీట్లను అస్సలు చూడలేరు. ఫాలోవర్ని సాఫ్ట్ బ్లాక్ చేసినప్పటికీ, వారికి ఆ విషయాన్ని ట్విట్టర్ తెలియజేయదు. అయితే మీరు సాఫ్ట్ బ్లాక్ చేసిన వ్యక్తి మళ్లీ మిమ్మల్ని రీ ఫాలో చేసే అవకాశం కూడా ఉంటుంది.
ట్విట్టర్ ఇప్పటికే ఈ ఫీచర్‌ని వెబ్ వెర్షన్లో రోలవుట్ చేయడం ప్రారంభించింది. అయితే యాప్ యూజర్లకు ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. మీ ఫాలోవర్స్ (Followers)ను బ్లాక్ చేయకుండానే ఎలా తొలగించాలో తెలుసుకోండి.
ఫాలోవర్స్‌ను బ్లాక్ చేయకుండా రిమూవ్ చేయడం ఎలా?
ముందుగా మీ ట్విట్టర్ అకౌంట్(Account) లోకి లాగిన్ అవ్వండి. తరువాత మీ ప్రొఫైల్‌ని సందర్శించండి. ఇప్పుడు, మీ "ఫాలోవర్స్" పై క్లిక్ చేయండి. మీరు ‘సాఫ్ట్ బ్లాక్’ చేయాలనుకున్న ఫాలోవర్ను సెలక్ట్ చేసుకోండి. సంబంధిత ఫాలోవర్ అకౌంట్ పక్కన ఉన్న మూడు చుక్కల మెనూని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించే "రిమూవ్ దిస్ ఫాలోవర్’’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అంతే, ఆ అకౌంట్ ‘సాఫ్ట్ బ్లాక్’ మోడ్‌లోకి వెళ్తుంది.
ట్వట్టర్లో వీడియోలు డౌన్లోడ్ చేసుకోండిలా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ‘డౌన్లోడ్ ట్విట్టర్ వీడియో (Download Twitter Video)’ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. తరువాత ఇన్స్టాల్ చేయండి. యాప్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ ట్వీట్ నుంచి వీడియో లేదా గిఫ్ (gif) ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్వీట్ లింక్ కాపీ చేయండి. ట్వీట్ లింక్ కాపీ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్లోని ట్విట్టర్ యాప్ లేదా వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్తే సరిపోతుంది.
మీకు కావాల్సిన వీడియో ట్వీట్ కింద షేర్ బటన్ పై నొక్కండి. తరువాత "కాపీ లింక్ టు ట్వీట్(Copy link to Tweet)" లేదా "షేర్ ట్వీట్ వయా (Share Tweet Via)" పై క్లిక్ చేయండి.
మీరు లింక్‌ను కాపీ చేసినట్లయితే.. ట్విట్టర్ యాప్ ను క్లోజ్ చేసి.. 'డౌన్లోడ్ ట్విట్టర్ వీడియో' యాప్ ఓపెన్ చేయండి. లింక్‌ను మీ స్క్రీన్ పై భాగంలో కనిపిస్తున్న టెక్స్ట్ ఏరియాలో పేస్ట్ చేయండి. ఆపై డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ట్వీట్ లింక్‌ను కాపీ చేయకుండా 'షేర్ ట్వీట్ వయా' ఆప్షన్ పై క్లిక్ చేస్తే... ‘డౌన్లోడ్ ట్విట్టర్ వీడియో'ని సెలక్ట్ చేసుకోండి. అప్పుడు ఈ ట్వీట్ లింక్ నుంచి 'డౌన్లోడ్ ట్విట్టర్ వీడియో' యాప్ మీకు కావాల్సిన వీడియోను డౌన్లోడ్ చేస్తుంది. ఈ వీడియో చూసేందుకు అప్లికేషన్ ఓపెన్ చేసి వీడియో లిస్టులోకి వెళ్ళాలి. ఆ వీడియోని వేరే అప్లికేషన్ కు ఫార్వర్డ్ చేయొచ్చు లేదా మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజీలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.